ఆ విషయాలు బయటపెట్టి నగ్మపై నెటిజెన్స్ ట్రోల్ల్స్…కంగనా పై అలాంటి కామెంట్స్ చేసినందుకే.?

ఆ విషయాలు బయటపెట్టి నగ్మపై నెటిజెన్స్ ట్రోల్ల్స్…కంగనా పై అలాంటి కామెంట్స్ చేసినందుకే.?

by Megha Varna

Ads

సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఇప్పుడు బాలీవుడ్లో పెద్ద దుమారాన్ని రేపుతోంది.బాలీవుడ్ లో నెపోటిజం ఉందంటూ దానివల్లే సుశాంత్ మరణించాడంటూ ఈ అంశంపై పలువురు సినీ సెలబ్రిటీలు స్పందించారు. కంగనా అయితే ఒక అడుగు ముందుకేసి బాలీవుడ్లో నెపోటిజంకు బ్రాండ్ అంబాసిడర్ లు వీళ్ళే అంటూ కొందరు ప్రముఖుల పేర్లు బయట పెట్టింది.

Video Advertisement

ఇందులో మహేష్ భట్, దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా ఉన్నారు.అయితే తాజాగా నటి నగ్మా ఓ ట్వీట్ తో కంగనా పై ఫైర్ అయ్యారు.ఇంతకీ ఆ ట్వీట్ ఏంటో చూద్దాం.

” కంగనా దీదీ కూడా నెపోటిజం ప్రొడక్టే. ఎవరి సపోర్ట్ లేకుండా కంగనా బాలీవుడ్‌లో ఇంత స్థాయికి వచ్చిందా..? కంగనాను బాలీవుడ్‌ కు పరిచయం చేసిన ఆదిత్య పంచోలి, హీరోయిన్‌గా తొలి అవకాశం ఇచ్చిన మహేష్ భట్ లు నెపోటిజం వల్లే ఆమెకు అవకాశం ఇచ్చారా…?` అంటూ ప్రశ్నించింది”.

దీనికి స్పందించిన కంగనా సోషల్ మీడియా టీం..

ఆదిత్య పంచోలి తన కెరీర్ మొదట్లో ఓ గైడ్ గా వ్యవహరించారు.అంతేకాని అతడు కంగనా బాయ్ ఫ్రెండ్ కాదు పైగా అతడు కంగనాను చాలా హింసించాడు.తన పై చేయి కూడా చేసుకున్నాడు అంటూ కంగనా టీం నగ్మా పై ఫైర్ అయ్యింది.అలాగే ఆమెకు పెళ్లిళ్లలో డాన్స్ చేయడం ఇష్టం లేదు అందుకే ఏ ఏజెన్సీలు ఇప్పటివరకు ఆమెను హైర్ చేసుకోలేదు. కైట్స్ సినిమాలో తనని బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ కు పరిమితం చేసినందుకు తను క్రిష్ 3 లో నటించేందుకు తొలుత సుముఖత చూపలేదు కానీ ముందుగా ఇచ్చిన కమిట్‌మెంట్‌ కోసం ఆ చిత్రంలో చేశారు.

కేవలం బాలీవుడ్ డార్క్ సీక్రెట్స్ అన్నీ బయట పెడుతున్నందుకు ఆమెని ఇలా తప్పుడు కథనాలతో టార్గెట్ చేస్తున్నారని కంగనా టీం రిప్లై ఇచ్చారు.సుశాంత్ మరణంతో మొదలైన రచ్చ ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద దుమారం రేపుతోంది.ఇంతకీ ఈ వివాదం బాలీవుడ్ ను ఎటువైపు తీసుకెళ్తుందో వేచి చూడాలి.

ఈ క్రమంలో కొందరు నెటిజెన్స్ నగ్మ పై ఫైర్ అవుతున్నారు.


End of Article

You may also like