Ads
ప్రతి కథకు ఓ ముగింపు ఉంటుంది.ప్రతి జీవితానికి ఓ కారణం ఉంటుంది. కథ ముగింపు రచయత చేతిలో ఉంటుంది.జీవితం ముగించడం కాలంలో చేతిలోనో లేదా మన చేతిలోనో ఉంటుంది.ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలు సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.వీటికి ప్రధాన కారణం డిప్రెషన్,స్ట్రెస్ అని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
Video Advertisement
దాదాపు ఇలాంటి డిప్రెషన్ నుండి బయటపడ్డ హైవే పాట్రోల్ ఆఫీసర్ కెవిన్ తన కెరీర్ మొత్తంలో దాదాపు 200 మందితో మాట్లాడి వారిని సూసైడ్ చేసుకోవడం అపారు. ఈ ఘటన సాన్ ఫ్రాన్సిస్కో నగరంలో చోటు చేసుకుంది.సాన్ ఫ్రాన్సిస్కో నగరంలో గోల్డ్ గేట్ బ్రిడ్జి ఉంది.ఇక్కడ దాదాపు ఏటా కొన్ని వందల సంఖ్యలో సూసైడ్ లు నమోదు అవుతుంటాయి.
ఆ బ్రిడ్జి మీద పాట్రోలింగ్ ఆఫీసర్ గా ఉన్న కెవిన్ తన జీవితంలో కూడా డిప్రెషన్ అనే అంకాన్ని దాటి వచ్చినవారే అందుకే ఆ బ్రిడ్జి పై సూసైడ్ చేసుకోవాలని అనుకున్నవారిని కన్విన్స్ చేసి వారిని వెనక్కి పంపారు.ఇలా దాదాపు తన రిటైర్ అయ్యే సమయానికి సుమారు 200 మంది వరకు సేవ్ చేసినట్లు తన రిటైర్ అయ్యాక రాసిన గార్డెన్ ఆఫ్ గోల్డ్ గేట్ పుస్తకంలో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆ పుస్తకంలోని అంశాలు అక్కడ పెద్ద చర్చకు తలెత్తాయి.ప్రజలలో సూసైడ్ ఆలోచనలు రాకుండా ఉండడానికి ఏం చేయాలని ఎటువంటి చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలని విశ్లేషకులు,మేధావులు చర్చిస్తున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ ని చూసిన వారంతా కెవిన్ గ్రేట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
End of Article