Ads
కరోనా పుణ్యాన ఈసారి దాదాపు ప్రపంచంలో సగం మంది జనాభా పుట్టినరోజులు ఇంట్లోనో లేదా హాస్పిటల్ లోనో జరిగాయి జరుగుతున్నాయి.ఇలా ఎన్నాళ్లు ఇళ్లకే పరిమితం అవ్వాలో అటు డాక్టర్లు ఇటు పరిశోధకులు చెప్పలేకపోతున్నారు.ఇలాంటి టైంలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ ప్రస్తుతం హీరోగా టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా తన డిజిటల్ టీంను ఒక పోస్ట్ పెట్టమన్నాడు.దానికి మనోళ్లు ఓ పోస్ట్ పెట్టారు.ఆ పోస్ట్ ను బేస్ చేసుకొని తెలుగు మిమ్ పేజీలు రెచ్చిపోయాయి.
Video Advertisement
దానితో స్వయంగా ఆకాష్ పూరీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.తన లాస్ట్ ఇయర్ పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి ఫ్యాన్స్ సుమారు 2000 నుండి 3000 మంది కేక్స్ పట్టుకొచ్చి నా చేత కోయించారు.తాజాగా పరిస్థితులలో అది శ్రేయస్కరం కాదనే ఉద్దేశంతో నేను నా డిజిటల్ టీంను దీనికి సంబంధించి పోస్ట్ చేయమన్నాను కానీ మా వాళ్ళు కొంచెం క్రియేటివిటీ ఎక్కువ వాడేశారు.
అది నాకు ఆ పోస్ట్ చూశాక అర్థమైంది.అప్పటికే కంటెంట్ దొరికిన సోషల్ మీడియా వాళ్ళు నన్ను ఓ రేంజిలో ఆడేసుకున్నారు.ఇక అప్పటికే లేట్ అయిపోవడంతో ఆ పోస్ట్ ను డిలీట్ చేయలేదు.నేను ఈ 2020 బర్త్ డే ను అసలు మర్చిపోను అంటూ అసలు కథ చెప్పారు.
End of Article