“అమృత” పాత్రలో నటించిన ఆర్జీవీ కొత్త హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె గురించి ఆసక్తికర విషయాలు ఇవే.!

“అమృత” పాత్రలో నటించిన ఆర్జీవీ కొత్త హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె గురించి ఆసక్తికర విషయాలు ఇవే.!

by Megha Varna

Ads

వివాదాలకు కేంద్ర బిందువైన ఆర్జీవి ఈమధ్య నిజ జీవితం లో జరిగే సంఘటనలను కథలుగా మార్చేస్తున్నారు. లాక్ డౌన్ టైం లో అందరూ ఉపాధి కోల్పోయి ఇప్పుడు ఎలా అని బాధ పడుతుంటే ఈయన మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అమృత, మారుతీ రావు అనే తండ్రి కూతుళ్ళ కథ అందరికీ గుర్తుంది కదా ఇప్పుడు ఆర్జీవి దానిపై చిత్రం చేస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆర్జీవి ఫాదర్స్ డే రోజు రిలీజ్ చేశారు.ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయింది.ప్రస్తుతం ఆ ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Video Advertisement

ప్రస్తుతం ఈ చిత్రంలో నటించిన నటీనటులు ఎవరో తెలుసా అనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ వీరు ఎవరు మీరు కూడా ఓ లుక్కేయండి. ఈ చిత్రంలో మారుతీరావు గా నటిస్తుంది శ్రీకాంత్ అయ్యంగార్ ఈయన బోలెడు తెలుగు చిత్రాలలో బాబాయి, ఫాదర్ పాత్రలలో నటిస్తున్నాడు. సాయి ధర్మ తేజ్ నటించిన ప్రతి రోజూ పండగే చిత్రంలో ఈయన బాబాయి గా నటించి అందరి చేత నవ్వులు పూయించాడు.ఇక అమృత గా నటించిన అమ్మాయి పేరు సాహితీ.ఈమె పక్కా హైదరాబాద్ అమ్మాయి.ఈమె టెన్త్ క్లాస్ చదువుతున్న రోజులలో బాయ్ అనే చిత్రంలో నటించింది.రీసెంట్ గా ఈమె హిట్ సినిమాలో కూడా చేసింది.

సైడ్ క్యారెక్టర్ లో చిన్న చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తున్న సాహితీ ఇప్పుడు ఏకంగా ఆర్జీవి చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఎందరో హీరోయిన్స్ భవిష్యత్తును మార్చేసిన ఆర్జీవి. ఈ చిత్రంతో సాహితీ కెరియర్ ను ఎలా మారుస్తారో చూడాలి.


End of Article

You may also like