Ads
బీసీసీఐ ప్రతి సంవత్సరం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఐపీఎల్ ను ఈసారి కూడా అంతరాయం లేకుండా నిర్వహించడానికి లాబీయింగ్ జరిపిందని అందువల్లే ఐసిసి టి20 వరల్డ్ కప్ వాయిదా పడిందని పాకిస్థాన్ వరసుగా ఆరోపణలు చేస్తుంది.ఈ విషయాన్ని అసలేవ్వరు పట్టించుకోవట్లేదు.ఇలాంటి టైంలో పాకిస్థాన్ బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పై సంచలన వాఖ్యలు చేశారు.అవి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Video Advertisement
భారత్ ధోని సారథ్యంలో ఫీల్డింగ్ పై మరియు ప్లేయర్స్ (ఫిట్ నెస్) పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది.దాని ఫలితంగా ప్రస్తుతం భారత క్రికెటర్లు అతితక్కువగా గాయాల పాలవుతున్నారు.దీనితో మిగతా క్రికెట్ దేశాలలో ఇప్పుడు భారత్ ప్లేయర్స్ (ఫిట్ నెస్) పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.ఈ చర్చలో భాగంగా వకార్ యూనిస్ భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పెద్ద అథ్లెట్ అని అంగీకరిస్తున్నాను అలాగని మా బాయ్స్ వెనుక పడిపోలేదు అంటూ కామెంట్ చేశారు.ఇప్పుడు ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
End of Article