Ads
చైనీస్ విద్యార్థులను బెదిరించి తమ తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం ఇటీవల ఆస్ట్రేలియాలో ఎక్కువైంది. ఇంకొక విషయం ఏంటంటే ఇదంతా చాలా ప్లాన్ తో ఎవరికీ అనుమానం రాకుండా చేస్తున్నారు. ఒక టీం లాగా ఏర్పడి ఈ నకిలీ కిడ్నాప్ లకు పాల్పడుతున్నారు.ఆస్ట్రేలియా బయట ఎక్కడో ఒక ప్రాంతంలో ఈ టీం ఒక టెలిఫోన్ బూత్ ని ఏర్పాటు చేసుకుంటారు. అక్కడి నుండి ఎవరో ఒక చైనీస్ విద్యార్థికి తాము ఏదో ప్రభుత్వ శాఖ నుండి మాట్లాడుతున్నట్టు చెప్తారు. ఆ విద్యార్థి చైనాలో ఏదో ఒక నేరం చేస్తూ దొరికిపోయినట్టు లేదా ఇంకేదో సీరియస్ విషయంలో ఆ విద్యార్థి ప్రమేయం ఉంది అన్నట్టు మాట్లాడుతారు.
Video Advertisement
అరెస్టు చేయకుండా, దేశం నుండి బహిష్కరించకుండా ఉండాలి అంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తారు. అంతేకాకుండా ఈ విషయం గురించి ఇంట్లో వాళ్ళతోనూ స్నేహితులతోనూ చెప్పద్దు అని చెప్తారు. కొంతమందికి కిడ్నాప్ అయినట్టు ఇంట్లో చెప్పి డబ్బులు చెల్లించమని సూచిస్తారు .దాంతో చాలామంది విద్యార్థులు చేసేదేమీ లేక, అంత డబ్బులు ఎలా తీసుకురావాలో తెలియక తమని తాము కిడ్నాప్ చేసుకుని వాళ్ళని ఎవరో కిడ్నాప్ చేసినట్టు ఒక నాటకమాడి తమ తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వీళ్ళకి చెల్లిస్తారు.
ఇలానే ఇటీవల ఒక విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు కిడ్నాప్ అయినట్టు సమాచారం అందితే, వాళ్ళు 10 కోట్ల దాకా డబ్బులు పంపి, సిడ్నీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఒక గంట సేపటి పాటు గాలించి ఆ విద్యార్థి ఒక హోటల్లో క్షేమంగా ఉన్నట్లు గుర్తించారు.ఈ విషయంపై న్యూ సౌత్ వేల్స్ పోలీసులు మాట్లాడుతూ ” వాళ్లు సాధారణంగా మాండరిన్ భాషలో మాట్లాడతారు. ఫోన్ బుక్ లో చైనీస్ పేర్లతో ఉన్నవారికి ఆటోమెటెడ్ కాల్స్ వెళ్లేలా వాళ్లు ప్లాన్ చేశారు. ఇలాంటి కేసులు దాదాపు ప్రతి వారం వస్తున్నాయి.
నిందితులు విద్యార్థులను మానసికంగా నియంత్రిస్తున్నారు. దాంతో నిందితులు ఎలా చెప్తే విద్యార్థులు అలా చేస్తున్నారు. కొంతమంది విద్యార్థులు అయితే తప్పు చేశామన్న భావనలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం లేదు. ఇలాంటి కాల్స్ వస్తే అవి మోసం అని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి” అని అన్నారు.
End of Article