వాడెవడో నాకు తెలియదు.. కనిపిస్తే పళ్ళు రాలిపోతాయి.. అంటూ ఫైర్ అయిన సునీత

వాడెవడో నాకు తెలియదు.. కనిపిస్తే పళ్ళు రాలిపోతాయి.. అంటూ ఫైర్ అయిన సునీత

by Megha Varna

Ads

ఎప్పుడు కూల్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్లే సింగర్ సునీత గారికి ఆమె వాయిస్ కు ఇండస్ట్రీలో బోలెడు మంది ఫ్యాన్స్ ఉన్నారు.తన పైన రూమర్స్ వచ్చినా పెద్దగా పట్టించుకోని సునీత గారు తాజాగా ఓ వీడియోలో ఓ వ్యక్తి పై ఫైర్ అయ్యారు.

Video Advertisement

అసలు కథేంటంటే చైతన్య అనే వ్యక్తి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా సాక్షిగా అతడు సునీత గారి బంధువునని చెబుతూ అవకాశాలు ఇప్పిస్తానని కొందరు యువతీ,యువకుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నాడు.ఈ విషయం ఒక ఆర్టికల్ ద్వారా తెలుసుకున్న సునీత గారు.

నిన్న ఫేస్ బుక్ లో దీని పై ఓ వీడియోను పోస్ట్ చేశారు.అలాంటి పేరుతో ఉన్నవారేవరూ నాకు తెలియదు.కానీ అతను నా పేరును ఉపయోగిస్తూ అందరినీ మోసం చేస్తున్నాడు.వాడిని నేను ఊరకనే వదలను వెంటనే అతని పై పోలీస్ కంప్లైంట్ చేస్తాను.ఇలాంటి వారి వలలో చిక్కుకొని మోసపోకండి.ఇలాంటివి అసలు నమ్మకండి.

వాడు నాకు దొరికితే పళ్ళు రాలగొడతానని అన్నారు.ఇలా ఈమధ్య కాలంలో సెలబ్రిటీల పేర్లను వాడుకొని అమాయకుల వద్ద డబ్బులు దోచుకునే వారి సంఖ్య ఎక్కువైపోయింది.ఇలాంటి వారిని నిర్మూలించడానికి చట్టాలు వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని సునీత గారికి మద్దతుగా ఆమె ఫ్యాన్స్ ఆమె పోస్ట్ చేసిన వీడియో కింద కామెంట్ చేశారు.


End of Article

You may also like