సోనూసూద్ సోనాలికి ఇచ్చిన ఓ ప్రేమ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్..సోనూసూద్ లవ్ స్టోరీ

సోనూసూద్ సోనాలికి ఇచ్చిన ఓ ప్రేమ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్..సోనూసూద్ లవ్ స్టోరీ

by Megha Varna

Ads

మనల్ని అలరించడానికి ఒళ్ళు హూనం చేసుకునే సినీ నటుల జీవితాలు అంత సాఫీగా సాగవు.అంతేకాకుండా వాళ్ళ జీవితాలకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ మీడియా నోళ్ళ లో నానుతుంటాయి.ఇక కరోనా టైంలో ఉపాధి కోల్పోయిన ప్రజలకు తానున్నానంటూ ముందుకొస్తున్న సోనూసూద్ గురించి ఇప్పుడు తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.దాని కథేంటో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

సోనూసూద్ నాగపూర్ లో చదువుకునే రోజులలో ఎంబీఏ చదివే తెలుగు అమ్మాయి సోనాలితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒకరిని ఒకరూ మొదటి చూపులోనే ఇష్టపడ్డారు.దానితో వారి ప్రేమ వ్యవహారం చాలా సాఫీగా సాగింది.ఇక కొన్నేళ్ల తర్వాత పెద్దల అంగీకారంతో వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారు.సోనూసూద్ సినిమాల వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్నాడు.మొదట్లో ఈ విషయాన్ని సోనాలి ఒప్పుకోలేదు. కానీ సోనూసూద్ మీద ప్రేమతో ఆమె ఆతర్వాత అంగీకరించింది.

దీనితో సోనూసూద్ ముంబై చేరి అక్కడ చిన్న ఉద్యోగం చేస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు.దీనితో ఆయనకు చిన్న చిన్న అవకాశాలు రావడం మొదలయ్యాయి.దానితో భార్యను ముంబై తీసుకొచ్చాడు.అక్కడ వీరిద్దరూ ఒక చిన్న ఇంట్లో అద్దెకు ఉండేవారు.ఆతర్వాత సోనూసూద్ కు అవకాశాలు రావడం తగ్గాయి. ఆ సమయంలో సోనాలి నే ఇంటిని పోషిస్తూ భర్తకు అండగా నిలిచింది.

లేట్ అయిన టాలెంట్ ఉన్నవారిని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి గా అలా కొంతకాలానికి సోనూసూద్ కు వరుసగా అవకాశాలు వచ్చాయి.వాటిని ఆయన సద్వినియోగం చేసుకోవడంతో సౌత్, నార్త్ అని తేడా లేకుండా చిత్రాలలో అందరికీ మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారిపోయాడు.తాజాగా సోనాలిని మీడియా కరోనా టైంలో మీ భర్త అందరికీ సహాయం చేయడానికి డబ్బు ఖర్చు పెడుతున్నారుగా మరి దీనిపై మీరు ఎలా ఫీలవుతున్నారు అని అడిగితే దానికి ఆమె ఒక చిన్న చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది.అర్థం చేసుకునే భార్య అందరికీ దొరకదు.మంచి మనసు ఉన్న సోనూసూద్ లాంటి వారికి తప్ప అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

అప్పట్లో మన సోనూసూద్ సోనాలికి ఇచ్చిన ఓ ప్రేమ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.దాని పై మీరు కూడా ఓ లుక్ వేయండి.


End of Article

You may also like