Ads
రిపబ్లిక్ టీవి సుశాంత్ సింగ్ కు న్యాయం జరగాలంటూ రోజూ డిబేట్స్ పెడుతుంది. తాజాగా ఈ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో కొన్ని ఆసక్తికర అంశాలు బయట పడ్డాయి అవేంటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
సుశాంత్ బాడీగార్డ్ ఒకరిని రిపబ్లిక్ టీవి అప్రోచ్ అయింది. ఆ టైంలో అతను హీరోయిన్ రియా చక్రవర్తి గురించి కొన్ని ఆసక్తికర అంశాలు బయటపెట్టాడు. రియా చక్రవర్తి తన తండ్రి , సోదరుడితో కలిసి సుశాంత్ అపార్ట్‌మెంట్ లో పార్టీలు ఇస్తుండేది. ఇందుకోసం సుశాంత్ డబ్బును వినియోగించేది.ఈ పార్టీలలో సుశాంత్ పాటిస్పేట్ చేయకుండా ఉండడం కోసం తన చేతే మెడికల్ స్టోర్ నుండి తెప్పించిన డ్రగ్స్ ను అతని చేత తాగించి మత్తులో ఉంచేది.
ఒకప్పుడు ఫిట్ గా ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సుశాంత్ రియా చక్రవర్తి తన జీవితంలోకి రావడంతో మత్తులో, నిద్రలో ఎక్కువ సమయం గడుపుతుండేవాడు.అంతేకాకుండా రియా తన మాట వినేవాళ్ళని సుశాంత్ కు బాడీ గార్డ్స్ గా నియమిస్తూ ఉండేది.
సుశాంత్ తండ్రి కేకే సింగ్ రియా చక్రవర్తి పై చేసిన ఆరోపణలన్నీ నిజమని అతను పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ స్టింగ్ ఆపరేషన్ కు సంబంధించి రిపబ్లిక్ టీవీ ప్రొజెక్ట్ చేసిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
watch video:
End of Article