Ads
తూర్పుగోదావరి రాజమహేంద్రవరం లో 10 నిమిషాల వ్యవధిలో పక్కపక్కనే ఉండే ఇంటి వారు ఆత్మహత్య చేసుకోవడం పెద్ద కలకలం సృష్టిస్తుంది.
Video Advertisement
సాక్షి కథనం ప్రకారం …రామస్వామిపేటకు చెందిన రౌతు శివ (29) భార్య సత్యశ్రీ కూతురు రోషిణి సాయితో కలిసి నాలుగేళ్ల కిత్రం వాంబే కాలనీకి నివాసం మారాడు.కుటుంబ ఉపాధి కోసం శివ, అతని భార్య సత్యశ్రీ నగరంలోని ఓ వస్త్ర దుకాణంలో పనికి చేరారు.గురువారం ఉదయం సత్యశ్రీ బయటకు వెళ్లి వచ్చే సరికి ఇంటి లోపల గడిపెట్టి ఉంది.డోర్ ను ఎంత కొట్టినా భర్త శివ డోర్ తీయకపోవడంతో భయపడిన భార్య పక్కింటి వారిని, ఇతరులను పిలిచింది.వారు తలుపు పగలగొట్టి లోపలకు వెళ్లేసరికి అక్కడ ఫ్యాన్‌కు ఉరివేసుకున్న శివ కనిపించాడు.
బ్లాక్ నంబరు–6లో ఉంటున్న దుర్గాదేవి తమ్ముడితో కలిసి అక్కడ నివాసం ఉంటుంది.ఇక శివ చనిపోయాడని తెలిసిన దుర్గ శివ మృతదేహం వద్దకు పరగున వచ్చి రోదిస్తూ కూర్చింది.ఇది చూసిన అక్కడ కొంతమంది ఆమెను మందలించారు.దానితో అక్కడి నుండి పరిగెత్తుకుంటూ తన ఇంటికి వెళ్ళిన దుర్గ తలుపు వేసుకుంది.అది చూసిన అక్కడివారు ఫ్యాన్ కు ఉరి వేసుకున్న ఆమెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ ఆమె హాస్పిటల్ లో మరణించింది.
ఇక కరోనా కారణంగా తాము ఆర్థిక ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్నామని అందువల్లనే తన భర్త సూసైడ్ చేసుకొని ఉంటాడని భార్య పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసింది.ఇక శివ ఐదేళ్ల కూతురు నాన్న లే ….అంటూ ఆ చనిపోయిన మృతదేహం వద్ద అంటుండటం అందరి మనసులను కలచి వేసింది.
తోడబుట్టిన అన్నలా భావించిన శివ మృతదేహాన్ని చూసి కన్నీరు కార్చిన తన మేన కోడులు దుర్గను అక్కడ ఉన్నవారిలో కొంతమంది చేయి చేసుకున్నారు అందుకే ఆ మనస్తాపాన్ని తట్టుకోలేక తను సూసైడ్ చేసుకుందని దుర్గ మేనమామ కేసు నమోదు చేశారు.
End of Article