Ads
కరోనా కారణంగా మూతబడిన వాటిలో హోటల్ రంగం కూడా ఒకటి. ఇటీవల గవర్నమెంట్ హోటల్స్ తిరిగి తెరవడానికి అనుమతి మంజూరు చేసింది. ఇప్పుడు మళ్లీ సేల్స్ పెరగడానికి హోటల్ రంగం వాళ్ళు జనాలను ఆకర్షించడానికి కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. ఇటీవల రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఉన్న ఒక రెస్టారెంట్ యాజమాన్యం తమ క్రియేటివిటీని ఉపయోగించి జనాలను ఆకర్షిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.
Video Advertisement
జోధ్ పూర్ లోని వేదిక్ అనే ఒక శాఖాహార (వెజిటేరియన్) రెస్టారెంట్ కోవిడ్ కర్రీ, ఫేస్ మాస్క్ నాన్, అనే పదార్థాలను వాళ్లు మెనూ లో ప్రవేశపెట్టింది. మలై కోఫ్తా కర్రీ లో ఉండే కోఫ్తా లను కరోనా వైరస్ షేప్ లో తయారు చేశారు. అలాగే బటర్ నాన్ కూడా ఫేస్ మాస్క్ రూపంలో తయారుచేసి కాదేది క్రియేటివిటీకి అనర్హం అని నిరూపించుకున్నారు.
దీనిపై వేదిక్ హోటల్ యజమాని అనిల్ కుమార్ మాట్లాడుతూ ” లాక్ డౌన్ తర్వాత కూడా ప్రజలు బయటికి వచ్చి తినడానికి భయపడుతున్నారు. దాంతో మేము కొత్తగా ఏమైనా చేయాలని నిర్ణయించుకున్నాం. అప్పుడే ఈ ఆలోచన వచ్చింది. చాలా మంది ప్రజలు ఈ వంటకాన్ని ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఎక్కువమంది ఈ కాంబినేషన్నే అడుగుతున్నారు.
ఏదేమైనా వైరస్ ఎలా వస్తుందో తెలీదు కాబట్టి టేక్ అవే ఆప్షన్ మంచిది. కానీ ఒకవేళ హోటల్ కి వచ్చి తినాలి అని అనుకున్నా కూడా ఎటువంటి సమస్య ఉండదు. ఎందుకంటే హోటల్ శుభ్రంగా ఉంచుతున్నాం. ప్రభుత్వం చెప్పిన అన్ని ఆదేశాలను పాటిస్తున్నాం. అలాగే ఎట్టిపరిస్థితిలోనూ సామాజిక దూరం ఉండేలా చూసుకుంటున్నాం” అని అన్నారు.
ప్రస్తుతం ఈ మెనూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకుముందు కూడా మధురైకి లో ఒక హోటల్ కరోనా దోస, మాస్క్ పరోటా తయారుచేసి తమ క్రియేటివిటీని చాటుకున్నారు.
End of Article