Ads
ఇటీవల రైల్వే ప్రభుత్వం 151 ప్రైవేట్ ట్రైన్ లు నడవడానికి 109 రూట్లను మంజూరు చేసింది. కానీ బిడ్డర్లు ఈ నిర్ణయం పై అనేక సందేహాలను వ్యక్తం చేశారు. వాళ్ళందరి సందేహాలకు సమాధానం చెబుతూ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ పియూష్ గోయల్ మాట్లాడారు.
Video Advertisement
ఇండియన్ రైల్వే ద్వారా ట్రైన్లో ఆపరేట్ చేస్తున్న ప్రైవేట్ ప్లేయర్లకు ప్యాసింజర్ లపై టికెట్ చార్జీలపై అప్పర్ లిమిట్ లేదు అని చెప్పారు. ప్రైవేటు ట్రైన్ లో టిక్కెట్లు అనేది మార్కెట్ ఆధారంగా ఉంటాయి. కాబట్టి టికెట్ ధర ఎంత ఉండాలి అనే దాని మీద ఇంకా ఏమి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పారు.
రైల్వే యాక్ట్ ప్రకారం టికెట్ ధర ఎంత ఉండాలి అని నిర్ణయం తీసుకునే హక్కు మినిస్ట్రీ కి లేదా యూనియన్ గవర్నమెంట్ కి మాత్రమే ఉంది. కాబట్టి ఒకవేళ దీని గురించి చర్చించాలి అంటే రైల్వే అధికారులు క్యాబినెట్ అప్రూవల్ లేదా పార్లమెంట్ శాంక్షన్ పొందాలి.
అలాగే ప్రైవేటు ట్రైన్ లు ఎక్కువ దూరం వెళ్ళలేవు కాబట్టి గంటకు 160 కి.మీ ఎలా ప్రయాణిస్తాయి అన్న అనుమానం కూడా కొన్ని కంపెనీల యాజమాన్యాలు వ్యక్తం చేశాయి. దానికి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నారు.
రోలింగ్ స్టాక్ కి సంబంధించిన టెక్నికల్ విషయాలపై రైల్వే ఇంకా ఏ నిర్ణయాన్ని తీసుకోలేదు. అలాగే ప్రైవేట్ రైళ్ల బాధ్యతలు నిర్వహించే వారు చెప్పిన దాని ప్రకారం 40 వేల కిలోమీటర్లు 31 రోజులు నడిచిన ట్రైన్ కు సర్వీసింగ్ కచ్చితంగా అవసరం. కానీ ఆ సదుపాయం మనకి ఇక్కడ అంత సులభంగా దొరకదు.
దీని గురించి అడిగితే తొందర్లోనే డ్రాఫ్ట్ స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన రిపోర్టు విడుదల చేస్తామని, అందులోనే దీనికి సంబంధించిన నియమాలు గురించి కూడా చెప్తామని చెప్పారు.
End of Article