సుశాంత్ ది హత్య అంటున్న రక్షణ శాఖ డాక్టర్…!

సుశాంత్ ది హత్య అంటున్న రక్షణ శాఖ డాక్టర్…!

by Megha Varna

Ads

దేశాన్ని విస్తుపోయేలా చేసిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు రోజుకొక మలపు తిరుగుతుంది. ఎంతోమంది ప్రముఖులు ఇది ఆత్మహత్య కాదు హత్య అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా మౌనంగా ఉండడంతో మరిన్ని అనుమానాలకు తావిచ్చేలా ఈ కేసు తయారవుతుంది.ఇక తాజాగా బీహార్ పోలీసులు విచారణకు హజరవ్వాలని హీరోయిన్ రియా చక్రవర్తిని ఆదేశించారు కాని ఆమె ప్రస్తుతం కుటుంబంతో సహా ఎక్కడికో మాయమైనట్లు రిపబ్లిక్ టివి కథనం ప్రొజెక్ట్ చేసింది.

Video Advertisement

ఇక తాజాగా మీడియాలో సుశాంత్ ఫోటోలను పరిశీలించిన డాక్టర్ మీనాక్షి మిత్రా ఇది ఖచ్చితంగా హత్యేనని విమర్శిస్తున్నారు.ప్రస్తుతం ఈమె రక్షణ శాఖ ఆర్డినెన్స్ ఆస్పత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్నారు.ఈమె సుశాంత్ మృతదేహం పై ఉన్న గాయాలను చూశాక ఈ అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు.ముందుగా సుశాంత్ హత్య చేసి ఆ తర్వాత దీన్ని ఆత్మహత్యలా క్రియేట్ చేశారని ఆమె ఆరోపించారు.

దీనికి తగ్గట్టే కొద్దిరోజుల క్రితం ముంబై పోలీసులు సుశాంత్ బెడ్ ను సర్దుతూ ఈ వీడియో బయటకు వస్తే పెద్ద గందరగోళం అయిపోతుంది అని సంభాషించుకుంటూ ఉన్న ఓ వీడియో గుట్టును రిపబ్లిక్ టీవీ బయటపెట్టింది. అంతేకాకుండా సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసుపై వరుసగా రిపబ్లిక్ టీవీ ప్రోగ్రాం చేస్తూ అతనికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది.

రిపబ్లిక్ టీవీ సుశాంత్ సూసైడ్ పై వరుస కథనాలు ప్రసారం చేయడంతో ప్రజలలో సుశాంత్ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ పెరుగుతుంది.


End of Article

You may also like