Ads
ఎప్పుడూ షూటింగ్ లు ప్రమోషన్స్ అంటూ బిజీగా ఉండే సెలబ్రెటీలు లాక్ డౌన్ ఎఫెక్ట్ తో అందరూ ఇళ్లకు పరిమితమయ్యారు.ఇక ఇప్పుడు లాక్ డౌన్ మినహాయింపులు ఒక్కొక్కటిగా వస్తుండడంతో ఇంతకుముందులా మరోసారి సెలబ్రిటీలు బాగా బిజీ అయిపోనున్నారు.ఈ సందర్భంలో కెమెరా ముందు మాట్లాడిన ప్రగతి గారు తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Video Advertisement
సినిమాలలో సాంప్రదాయమైన అమ్మగా మోడరన్ పిన్నిగా నటించి మనల్ని అలరిస్తున్న ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడూ డాన్స్ లు,వర్కౌట్లు చేస్తూ ఫిట్ నెస్ ఆవశ్యకతను నేటి తరం యువతకు తెలియజేస్తున్నారు.షూటింగ్స్ లో ఎప్పుడూ బిజీగా ఉండే ఈమె ప్రస్తుతం తన ఫ్యామిలీతో టైం గడపుతున్నాని చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా తన చేతి మీద ఎన్ని టాటూలు ఉన్నాయో వాటి వెనుక ఉన్న సిక్రెట్స్ ఏంటో చెప్పేశారు.అవేంటో ఇప్పుడు చూద్దాం.చిన్నప్పుడు తనకు టీకా వేసేటప్పుడు తన భుజం పై ఓ గాయం అయ్యిందని అందుకే అక్కడ సూర్యుని టాటూ వేయించుకున్నాని అలాగే తన మోచేతికి చేతికి మధ్య ఓ టాటూ ఉంది అది తన బెస్ట్ ఫ్రెండ్ తను కలిసి వేయించుకున్నామని చెప్పారు.ఆగండి ఇంకో టాటూ కూడా ఉంది అదే ఆమె ఉంగరం వేలు పైన ఉంది.దాని అర్థం క్వీన్ ఆట.సో ఇలా తన గురించి అభిమానులతో ఆసక్తికర విషయాలు పంచుకున్న ప్రగతి గారు తన టాటూలు వెనుక దాగున్న సీక్రెట్స్ ను కూడా చెప్పేశారు.
End of Article