Ads
దాదాపు 28 ఏళ్ల వరకు ఉపవాసం ఉన్న ఒక 82 ఏళ్ల వృద్ధురాలు ఇటీవల తన ఉపవాసాన్ని విరమించుకోబోతున్నారు. అందుకు కారణం అయోధ్యలోని రామ మందిరానికి సంబంధించిన వివాదం. వివరాల్లోకి వెళితే. మధ్యప్రదేశ్ కి చెందిన ఊర్మిళాదేవి రామ భక్తురాలు.
Video Advertisement
1992లో బాబ్రీ మసీద్ కి ఇంకా రామ మందిరానికి మధ్య వివాదాలు అవ్వడంతో మళ్లీ రామ మందిరం తిరిగి గుర్తింపు లోకి వచ్చేంతవరకు తినను అని ఉపవాస దీక్ష చేపట్టారు ఊర్మిళాదేవి.
ఇప్పుడు రామ మందిరానికి గుర్తింపు వచ్చినా కూడా కరోనా కారణంగా, ఊర్మిళాదేవి రామ మందిరాన్ని సందర్శించలేకపోతున్నారు. ఆగస్టు 5న అయోధ్యలోని రామ మందిరం లో జరగబోతున్న శిలన్యాల ఉత్సవాలకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆ ఉత్సవాలకు హాజరయ్యి శ్రీ రాముని దర్శనం చేసుకొని, సరయూ నది దగ్గర తన ఉపవాస దీక్షను విరమించుకుంటాను అని, రామ నామము జపిస్తూ భూమి పూజ లో పాల్గొంటాను అని ఊర్మిళ దేవి అన్నారు.
ఊర్మిళాదేవి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఊర్మిళ గొప్ప రామ భక్తురాలు అని, 1992లో రామమందిర నిర్మాణానికి సంబంధించిన గొడవ జరిగినప్పుడు ఊర్మిళ కి 54 సంవత్సరాలు ఉంటాయని, గొడవ జరిగినప్పటి నుండి తను అన్నం జోలికి వెళ్లను అని ప్రతిజ్ఞ చేసింది అని, అప్పటినుండి కేవలం పండ్లు తింటూ నే తన జీవితాన్ని కొనసాగిస్తోంది అని, రోజు శ్రీ రామ నామం జపిస్తూ ఉంటుంది అని,
ఎప్పుడైతే రామమందిర నిర్మాణానికి మద్దతు ఇస్తూ సుప్రీం కోర్టు తన తీర్పును విడుదల చేసిందో అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని, ఇంకా జడ్జి లని ఊర్మిళాదేవి తన లేఖల ద్వారా అభినందించారు అని , కుటుంబ సభ్యులందరూ మళ్లీ ఊర్మిళాదేవి ఎప్పుడు వాళ్లతో కలిసి మామూలుగా భోజనం చేస్తుంది అని ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇదంతా మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం నాడు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
End of Article