రేపు జరగబోయే అయోధ్య రామ మందిర భూమి పూజా కార్యక్రమ పూర్తి వివరాలు ఇవే…శుభ ముహూర్తం ఎప్పుడంటే?

రేపు జరగబోయే అయోధ్య రామ మందిర భూమి పూజా కార్యక్రమ పూర్తి వివరాలు ఇవే…శుభ ముహూర్తం ఎప్పుడంటే?

by Mohana Priya

Ads

అయోధ్యలో రామమందిరం భూమిపూజ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల తో ఆ ప్రదేశం అంతా పండగ వాతావరణం నెలకొంది. ఈ రోజు నుండి అయోధ్యలో పూజలు ప్రారంభం అవుతున్నాయి. స్థానికులు గంట మోగిస్తూ, లేదా ప్లేట్ల పై కొడుతూ శ్రీరాముడిని స్వాగతిస్తారు.

Video Advertisement

ముహూర్త సమయమైన ఉదయం 11 గంటల 40 నిమిషాలు అవ్వడానికి ఒక పది నిమిషాల ముందు ప్రజలను బయటికి రావాలి అని కోరారు. పూజ తర్వాత అయోధ్యలో ప్రసాదం పంచుతారు. ఆగస్టు 4వ తేదీ రాత్రి స్థానికులు వాళ్ల ఇళ్లల్లో ఇంకా గుడిలో దీపాలు వెలిగించి దీపావళిని జరుపుకుంటారు అని సమాచారం.

ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరవుతారు. అయోధ్యలో మోదీ మూడు గంటలు ఉంటారు. రామ మందిరం భూమి పూజకు 175 మంది అతిథులను ఆహ్వానించారు. వారిలో 135 మంది వివిధ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు చెందిన వారు. అయోధ్య రామ మందిరం లో జరిగే భూమి పూజ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.

#1 ఆగస్టు 3వ తేదీన వినాయకుడు పూజ జరుగుతుంది.

#2 ఆగస్టు 4 వ తేదీన హనుమంతుడి పూజ, నిషాన్ పూజ జరుగుతాయి.

#3 భూమి పూజ ఈ కార్యక్రమంలో కాశీ, ఢిల్లీ, అయోధ్య, ప్రయాగ నుండి 21 మంది పండితులని ఆహ్వానించారు. ఒక్కొక్క పూజా విధానాన్ని ఒక్కొక్క పండితులు నిర్వహిస్తారు. మొత్తం 21 మంది పండితులు వివిధ విధానాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇదంతా ఒకే సమయంలో అవ్వదు. ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క పూజా విధానాన్ని ఒక్కొక్క బ్రాహ్మణులతో నిర్వహిస్తారు.

#4 ఉదయం 9 గంటల 35 నిమిషాలకు ప్రధాని మోదీ న్యూ ఢిల్లీ నుండి బయల్దేరతారు.

#5 ఉదయం 10 గంటల 35 నిమిషాలకు మోదీ లక్నో ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవుతారు.

#6 10 గంటల 40 నిమిషాలకు ఎయిర్ పోర్ట్ నుండి హెలికాప్టర్ లో అయోధ్యకు బయలుదేరుతారు.

#7 11 గంటల 30 నిమిషాలకు అయోధ్యలో ఉన్న సాకేత్ కాలనీలో హెలిపాడ్ మీద మోడీ ఉన్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది.

#8 11 గంటల 40 నిమిషాలకి హనుమాన్ గర్హి ని దర్శించుకుంటారు.

#9 12 గంటలకు రామజన్మభూమి వద్దకు చేరుకుంటారు.

#10 పది నిమిషాలు రామ్ లల్లా (శిశువు రూపంలో ఉన్న రాముడు) ని దర్శించుకుంటారు.

#11 మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు ఆలయ ప్రాంగణంలో చెట్లు నాటే కార్యక్రమం ఉంటుంది.

#12 12 గంటల 30 నిమిషాలకు భూమి పూజ ప్రారంభమవుతుంది.

#13 మధ్యాహ్నం ఒక గంట 10 నిమిషాలకు గంటలకు స్వామి నృత్యగోపల్ దాస్ మరియు రామ్ జన్మభూమి ట్రస్ట్ సభ్యులతో సమావేశం ఉంటుంది.

#14 మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాలకు పీఎం మోడీ సాకేత్ హెలిప్యాడ్‌ వద్దకు బయలుదేరుతారు.

#15 2 గంటల 20 నిమిషాలకు లక్నో నుండి బయలుదేరుతారు.


End of Article

You may also like