రామ మందిర నిర్మాణ భూమి పూజ ఇన్విటేషన్ కార్డు ఇదే…మోదీతో సహా 5 మంది ఎవరంటే?

రామ మందిర నిర్మాణ భూమి పూజ ఇన్విటేషన్ కార్డు ఇదే…మోదీతో సహా 5 మంది ఎవరంటే?

by Mohana Priya

Ads

అయోధ్య లోని రామ మందిరంలో జరిగే భూమి పూజ కు రెండు రోజుల ముందు ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. కోవిడ్ కారణంగా కేవలం పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానిస్తున్నారు. అతిథుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ పేరు తో పాటు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్లు ఉన్నాయి.

Video Advertisement

ఆహ్వాన పత్రిక లో పేర్లతో పాటు రాముడి చిత్రం కూడా ఉంది. కేవలం 150 వ్యక్తులకు మాత్రమే ఆహ్వాన పత్రికలు పంపుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా వేదికపై కూర్చోడానికి కేవలం ఐదు మందికే అనుమతి ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. వేదిక పై కూర్చుని వ్యక్తులలో ప్రధాని మోదీ,ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సిఎం యోగి ఆదిత్యనాథ్, మహంత్ నృత్య గోపాల్‌దాస్ ఉన్నారు.

ఆగస్టు 5వ తేదీన రామ మందిరం యొక్క భూమిపూజ నిర్వహించబడుతుంది. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల 15 సెకన్లకు ప్రధాని నరేంద్ర మోదీ శిలాన్యాసం (పునాది రాయి వేయడం) చేయనున్నారు. మోడీ చేతిలో 40 కిలోల వెండి ఇటుకను ఉంచి భూమి పూజను జరిపిస్తారు. ఆగస్టు 5వ తేదీన ఈ కార్యక్రమం దూరదర్శన్ లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయోధ్యలో జరుగుతున్నాయి.


End of Article

You may also like