ఒకప్పుడు కోట్లు సంపాదించారు ఈ టిక్ టాక్ స్టార్స్…మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి?

ఒకప్పుడు కోట్లు సంపాదించారు ఈ టిక్ టాక్ స్టార్స్…మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి?

by Megha Varna

Ads

ఒక వీడియో అప్లోడ్ చేసినందుకు లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్ సంపాదిస్తూ దాదాపు ఫిల్మ్ స్టార్ హీరోకు ఉన్నంత క్రేజ్ ను మెయిన్ టైన్ చేసిన టిక్ టాక్ స్టార్లు. టిక్ టాక్ బ్యాన్ తో బాగా నష్టపోయారు.ఈ నష్టం అంచనాలను చూసిన వారంతా ఖంగు తింటున్నారు. మరి ఆ అంచనా ప్రకారం ‌ఇన్‌‌ఫ్ల్యూయన్సర్‌ ఎంత నష్టపోయారో ఇప్పుడు ఆ టిక్ టాక్ యాప్ బ్యాన్ వల్ల వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

 

టిక్ టాక్ బ్యాన్ అవ్వడంతో టాప్ 100 ‌ఇన్‌‌ఫ్ల్యూయన్సర్‌ లుగా కొనసాగుతున్న వారు ఇప్పటివరకు దాదాపు 120 కోట్లు కోల్పోయారని ఇండియన్‌ ‌ఇనిస్టిట్యూట్‌‌ ఆఫ్‌ హ్యూమన్‌ ‌బ్రాండ్స్‌(ఐఐహెచ్‌‌బీ) అంచనా వేసింది.ఇక టిక్ టాక్ బ్యాన్ అవ్వడంతో ఈ సమయాన్ని యూజ్ చేసుకోవడానికి రొపోస్సో, రీల్స్‌ వంటివి మార్కెట్ లో రిలీజ్ అయ్యాయి.ఇక టిక్‌‌టాక్‌ లో దాదాపు 1.1కోట్లమంది ఫాలోవర్లు ఉన్న గీత్ టిక్ టాక్ బ్యాన్ అవడంతో ఇన్‌‌స్టాగ్రామ్‌‌రీల్స్‌కు మారారు.కాని ఆమెకు టిక్ టాక్ తరహాలో రీల్స్ లో ఫాలోయింగ్ రావట్లేదు.

అంతేకాకుండా తన వీడియోస్ కు పెద్ద రీచ్ కూడా రావట్లేదని అన్నారు.ఇక మరో ‌ఇన్‌‌ఫ్ల్యూయన్సర్‌ రియాజ్‌ ‌అలీ. ఇతనికి టిక్‌‌టాక్‌‌లో 4.33 కోట్ల ఫాలోవర్స్ ఉన్నారు.ఇక తన ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో కేవలం 84 లక్షల మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. రెవెన్యూల పరంగా చూసిన టిక్‌‌టాక్‌‌ తో పోలిస్తే మిగతా యాప్స్ నుండి అంత రెవెన్యూలు రావట్లేదని వీరు వాపోతున్నారు.

 

ఇలాంటి టైంలో కంటెంట్‌ క్రియేటర్లను, ‌ఇన్‌‌ఫ్లూయన్సర్లను ఆకర్షించేందుకు యాప్‌లు బోలెడు ప్రయత్నాలు చేస్తున్నాయి.అందులో భాగంగా ఇండియా మేడ్ చింగారి ఓ టాలెంట్‌‌ హంట్‌ ‌షోనూ ప్రకటించింది. ఇందులో టాప్‌ కంటెంట్‌‌ క్రియేటర్లుకు కోటి రూపాయల వరకు సంపాదించుకునే అవకాశాన్ని ఈ సంస్థ ప్రకటించింది..

ఇక అమెరికాకు చెందిన ‌ఫైర్‌ వర్క్‌ క్రియేటర్‌ ఛాలెంజింగ్‌‌ను స్టార్ట్‌ చేసింది. ఇందులో క్రియేటర్లకు దాదాపు 5 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు ఆఫర్‌ చేస్తోంది.ఇక ఇన్‌‌స్టాగ్రామ్‌ ప్రస్తుతానికి కొందరు ఇన్‌‌ఫ్లూయన్సర్లతోనూ చర్చలు జరుపుతునట్లు వార్తలు వస్తున్నాయి.మరి ఇందులో ఎంత నిజముందనేది తెలియాల్సి ఉంది.


End of Article

You may also like