సుశాంత్ కేసును సిబిఐ కి అప్పగించిన సుప్రీమ్ కోర్ట్.!

సుశాంత్ కేసును సిబిఐ కి అప్పగించిన సుప్రీమ్ కోర్ట్.!

by Megha Varna

Ads

సుశాంత్ సింగ్ సూసైడ్ కేసు రోజుకొక సరికొత్త మలుపు తిరుగుతుంది.ఈ కేసు ఇప్పటికే బీహార్ పోలీసులు వెర్సెస్ ముంబై పోలీసులు అనే కోణంలోకి మారుతుంది. ముంబై పోలీసులు ఈ కేసును క్లోజ్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని దేశంలోని సుశాంత్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.అలాగే సుశాంత్ తండ్రి కేకే సింగ్ బీహార్ లో కేసు నమోదు చేశారు.అందుకోసం హీరోయిన్ రియాను విచారణకు హాజరవ్వాలని కోరారు.కాని ఇందుకు రియా చక్రవర్తి హజరవ్వలేదు.

Video Advertisement

బీహార్ నుండి కేసు విచారించడానికి వచ్చిన పోలీసులు టీంను ముంబై పోలిసులు క్వారంటైన్ లో పెట్టారు.ముంబై పోలీసులు సుశాంత్ కేసులో వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిచ్చేలా ఉంది.పైగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున్న ఈ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకే ఈ కేసును కేంద్రం సిబిఐకి అప్పజెప్పినట్లు సుప్రీం కోర్టుకు తెలియజేసింది.

తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.సిబిఐ చేతికి చేరిన సుశాంత్ సూసైడ్ కేసులో ఇప్పటికైనా నిజాలు నిగ్గు తేలుతాయో లేదో వేచి చూడాలి.


End of Article

You may also like