Ads
కొన్ని దశాబ్దాల భారతీయుల కల ఆగస్టు 5న నెరవేరింది. రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ చేతులు మీదుగా శంకుస్థాపన జరిగింది. ఇలాంటి టైంలో దక్షిణకొరియా, అయోధ్యకు ఉన్న బంధుత్వం గురించి ప్రస్తుతం ఓ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.అదేంటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
క్రీ.శ.48 లో అయోధ్యలోని మిశ్రా కుటుంబానికి చెందిన యువరాణి సూరి రత్న అప్పటి నమ్మకాల ప్రకారం తను మొదలుపెట్టిన పడవ ప్రయాణం సాఫీగా సాగాలని భావించి తన వెంట ఓ రెండు చేపలు ముద్దాడుతున్న రాయిని పడవలో పెట్టుకొని సముద్రం మార్గం ద్వారా కొరియాకు చేరుకున్నారు.
అక్కడ తన పేరును హో వాంగ్ ఓక్ అని మార్చుకుని, కారా వంశానికి చెందిన తొలి రాజు కిమ్‌ను వివాహం చేసుకుంది.వీరికి పదిమంది సంతానం. అప్పటిలో కలిసి ఉన్న కొరియా ఇప్పుడు దక్షిణ కొరియా, ఉత్తర కొరియా అనే రెండు దేశాలుగా విడిపోయాయి.ఇప్పటికీ ఈ రెండు దేశాలలో కిమ్ కుటుంబానికి చెందిన వారే ఎక్కువగా ఉంటారు.
ఇక అప్పట్లో కారా వంశానికి అమ్మ తనతో తెచ్చిన రెండు చేపలు ముద్దాడుతున్న రాయి కొరియలోది కాదని ఉత్తరప్రదేశ్ లోని ప్రాంతం నుండి వచ్చిందని కిమ్ హే అనే ఓ ఆర్కియాలజిస్టు తేల్చారు.ఇక ఇప్పటికీ చాలామంది కొరియన్స్ భారత్ లోని అయోధ్య తమ పుట్టినిల్లుగా భావిస్తారు.అందుకే ఏటా ఇక్కడికే వేల సంఖ్యలో ఆ ప్రాంతాన్ని సందర్శించుకోవడానికి వస్తారు.
ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన సందర్భంగా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
#WATCH: South Korean first lady Kim-Jung Sook and UP CM Yogi Adityanath perform 'Aarti' on banks of Sarayu river in Ayodhya. #diwali pic.twitter.com/OVSTaHVl6C
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 6, 2018
End of Article