Ads
సుశాంత్ సింగ్ సూసైడ్ కేసు రోజుకొక సరికొత్త మలుపు తిరుగుతుంది.ఈ కేసు ఇప్పటికే బీహార్ పోలీసులు వెర్సెస్ ముంబై పోలీసులు అనే కోణంలోకి మారుతుంది. ముంబై పోలీసులు ఈ కేసును క్లోజ్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని దేశంలోని సుశాంత్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
Video Advertisement
అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో ఓ సూపర్ హిట్ కోసం నానా కష్టాలు పడుతున్న రియా చక్రవర్తి ప్రస్తుతం దేశమంతటా హాట్ టాపిక్ గా మారిపోయింది. బాలీవుడ్ లోని చాలామంది ప్రముఖులు ఈమె సుశాంత్ ని టార్చర్ చేసేదని అతని డబ్బు అంతా జల్సాలు కోసం వాడేదని ఆరోపిస్తున్నారు.
ఇక తాజాగా సుశాంత్ సూసైడ్ కేసు కేంద్రం సీబీఐకి అప్పగించినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. సుశాంత్ తండ్రి కేకే సింగ్ బీహార్ లో కేసు నమోదు చేశారు.అందుకోసం హీరోయిన్ రియాను విచారణకు హాజరవ్వాలని కోరారు.
ఇది ఇలా ఉండగా… రియా చక్రవర్తి ఆగష్టు 7 న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి సుశాంత్ కేసులో విచారణకు హాజరైంది. తన సోదరుడితో కలిసి ఓ ఖరీదైన కారులో వచ్చింది రియా. ఆ కారు ఫోటో చూసిన నెటిజెన్స్ చాలామంది రియాకు అంత ఖరీదైన ఫోర్డ్ ఎడీవోర్ కారు ఎక్కడిది అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
అయితే ఆ కారు రియాది కాదంట…ముంబైకి చెందిన సువేద్ లోహియాది అంట ఆ కారు. అతను ముంబైలోని ఓ ప్రముఖ స్టార్ హోటల్ ఓనర్. “జై హో, ఆర్యన్: అన్ బ్రేకబుల్” చిత్రాలలో నటించాడు. అతను సుశాంత్ కి కూడా మంచి స్నేహితుడు. సినీ పరిశ్రమలో చాలా మందితో అతనికి పరిచయాలు ఉన్నాయి. సుశాంత్ చనిపోయిన తర్వాత అతను సోషల్ మీడియాలో సుశాంత్ ని తలచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ కూడా చేసారు.
End of Article