Ads
ఎన్నో సంవత్సరాలు చర్చలు, తీర్పుల తర్వాత అయోధ్యలోని రామ మందిరానికి నిర్మాణం ప్రారంభమైంది. ఆగస్టు 5వ తారీఖున భూమి పూజ జరిగింది. రామ మందిరం నిర్మించే నిర్ణయం పట్ల చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Video Advertisement
కానీ ఇప్పుడు అంత ఖర్చు పెట్టి రామమందిరం నిర్మించాల్సిన అవసరం ఏముంది? అలా అంత పెద్ద రామ మందిరాన్ని నిర్మించే బదులు ఏదైనా బడి, లేదా హాస్పిటల్, లేదా ఇంకేదైనా ప్రజలకు ఉపయోగపడే నిర్మాణాన్ని కట్టొచ్చు కదా? అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు నెటిజన్లు ఈ విధంగా స్పందించారు.
సోషల్ మీడియా లో ఎంతో మంది నెటిజన్లు తమ అభిప్రాయాలని చెబుతూ రామ మందిరం ప్రభుత్వం డబ్బులతో నిర్మించడం లేదు, శ్రీరామ్ క్షేత్ర తీర్ధ ట్రస్ట్ డబ్బులతోనే రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు, మందిరం ఆరంభించే సమయంలో ప్రభుత్వం పెట్టిన ఒక్క రూపాయి తప్ప ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు అసలు మందిరం నిర్మాణం లో లేవు అని అంటున్నారు.
చరిత్ర తెలియని కొంతమంది వ్యక్తులు తమ సొంత లాభాల కోసం ఎంతో మంది యువతను ఈ చర్చలోకి లాగుతున్నారు అని. తమ రాజకీయ లాభాల కోసం ఇతరులను ఏవేవో ఆలోచనలతో ప్రభావితం చేయొద్దు అని అంటున్నారు.
అంతేకాకుండా రామమందిర నిర్మాణం వల్ల అయోధ్య లో నివసించే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది అని, ఎందుకంటే రామమందిరం దగ్గర పూల దుకాణాలు, అలాగే గుడికి రావడం కోసం ఆటోలు ఏర్పాటు చేస్తారు.
ఇతర ప్రదేశాల నుండి వచ్చిన వారికి వసతి ఏర్పాట్ల కోసం హోటల్స్ నిర్మిస్తారు అని, హోటల్స్ లో మిగిలిన పనులకోసం స్టాఫ్ నియమిస్తారు అని, అందువల్ల ఎంతో మందికి ఉద్యోగాలు దొరుకుతాయి అని, ఇలా అన్ని సదుపాయాలు కల్పించడం తో అయోధ్యలో టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది అని, కాబట్టి రామమందిర నిర్మాణం నిర్ణయం ఖచ్చితంగా సరైనదే అని అంటున్నారు.
End of Article