Ads
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా తన భార్య మైనపు విగ్రహాన్ని తయారు చేయించి గృహప్రవేశం చేశారు. కొన్నేళ్ల క్రితం ఆయన సతీమణి రోడ్ యాక్సిడెంట్ లో మరణించారు. నచ్చేశారు గుప్తా గారు… భార్య బతికి వుండగానే ప్రత్యక్ష నరకం చూపించే మగానుభావులు, పొద్దున లేస్తే అర్థాంగి మీద కుళ్లు జోకులు వేస్తూ పలుచన చేసే భర్త గార్లు ఉన్న ఈ లోకంలో మీరు సమ్ థింగ్ స్పెషల్.
Video Advertisement
గుండెల్లో గుడి కట్టుకోవడమే కాదు. ఏకంగా జీవకళ ఉట్టి పడుతున్న ఆమె మైనపు విగ్రహాన్నే తయారు చేయించి ఇంట్లో పెట్టుకున్నారీ పెద్దాయన. రాజసూయ యాగానికి ఆనాడు శ్రీరాముడు స్వర్ణ సీతమ్మను తయారు చేయిస్తే… నేటి ఈ శ్రీనివాసుడు గృహ ప్రవేశానికి ఏకంగా మైనపు సతీమణినే చేయించాడు. చెప్తే గానీ తెలిసేలా లేదు ఆమె కాదు అది విగ్రహమని. ఆ నవ్వు, చీర, నగలు ఎంత సహజంగా ఉన్నాయో. ఈ అద్భుతాన్ని సృష్టించిన కళాకారులూ అభినందనీయులే..!!!
వాస్తవానికి చచ్చాక గుళ్ళు, విగ్రహాలు పెట్టమని మా ఆడవాళ్లు కోరుకోరు. బతికి ఉన్నప్పుడు సాటి మనిషిగా ప్రేమ, గౌరవాన్ని కోరుకుంటారు. ఇది గత రెండు రోజులుగా ఫేస్బుక్ లో, వాట్సాప్ లో వైరల్ అవుతున్న కథ . కానీ చాలామందికి అతను ఎవరో తెలీదు .ఆ వివరాలు ఏంటో ? అసలు కథ ఏంటో? చూద్దాం రండి.
కర్ణాటక లోని కొప్పల్ కి చెందిన శ్రీనివాస్ గుప్తా ఒక వ్యాపారవేత్త. ఆయన భార్య మాధవి. మాధవికి ఎప్పటినుండో ఒక బంగ్లా కొనాలి అనే కోరిక ఉండేది. మూడేళ్ళ క్రితం మాధవి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి, కారులో తిరుపతి వెళ్తుండగా కోలార్ హైవే మీద వీళ్ళ కారు కి ఒక ట్రక్ ఎదురు వచ్చింది.
ట్రక్ వేగంగా వస్తోంది. కారు డ్రైవర్ వేగంగా వచ్చే ట్రక్ కారు దగ్గరికి రాకుండా ఉండడానికి కార్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు. దాంతో కారు అదుపుతప్పింది. మాధవి ప్యాసింజర్ సీట్లో కూర్చొని ఉన్నారు. వెనకాల సీట్ లో తన ఇద్దరు కూతుర్లు కూర్చొని ఉన్నారు. దాంతో వారికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. ముందు సీట్లో ఉండడంతో మాధవికి బాగా గాయాలయ్యాయి. ఆ ప్రమాదంలో మాధవి మరణించారు.
ఇటీవల గుప్తా ఒక ఇల్లు కొనుగోలు చేశారు. ఆ ఇంటిని అందంగా నిర్మించడానికి ఎంతో మంది ఆర్కిటెక్ట్ లను కలిశారు గుప్తా. కానీ ఏ ఒక్కరూ చెప్పిన డిజైన్ కూడా గుప్తా కి నచ్చలేదు. చివరికి కి మహేష్ రాగన్నదవరు అని ఆర్కిటెక్ట్ రూపొందించిన డిజైన్ గుప్తా కి నచ్చింది. కానీ ఏదేమైనా మాధవి లేని వెలితి అలానే ఉంది. ఆర్కిటెక్ట్ మహేష్ మాధవి జ్ఞాపకార్థం ఆవిడ విగ్రహాన్ని తయారుచేయించమని గుప్తా కి సలహా ఇచ్చారు.
ఈ ఆలోచన సరైనది అనుకున్న గుప్తా కర్ణాటకలోని గొంబే మానే (విగ్రహాలు తయారు చేసే వ్యక్తి) ని కలిశారు. ఆయన అచ్చం మాధవి లానే ఉండే విగ్రహాన్ని తయారు చేశారు. ముఖం దగ్గర నుండి, ధరించిన ఆభరణాలు, వేసుకున్న దుస్తులు అన్నీ చాలా సహజంగా ఉన్నాయి.
సడన్ గా చూస్తే మాధవి గారే అలా కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఇది చూసిన నెటిజన్లు విగ్రహం తయారు చేసిన వ్యక్తి ని ఎంతగానో అభినందించారు. మేడం టుస్సాడ్స్ మ్యూజియంలోని మైనపు బొమ్మల కి ఏ మాత్రం తీసిపోని విధంగా రూపొందించారు అని ప్రశంసించారు. మరికొంతమంది అయితే ఇంత మంచి నిర్ణయం తీసుకున్న గుప్తా ని అభినందిస్తున్నారు. బతికున్నప్పుడే మనిషికి విలువ ఇవ్వని ఈ సమాజంలో ఒక వ్యక్తిని ఇంతగా ప్రేమించడం చాలా గొప్ప విషయం అని అంటున్నారు.
నిజమే కదా? చాలా ఇళ్ళల్లో ఆడవాళ్ళకి విలువ ఇవ్వరు. అంతేకాకుండా ఆడవాళ్లకు విలువ ఇచ్చే మగవాళ్ళని చూసి ఎంతోమంది అదేదో తప్పు లాగా మాట్లాడుతారు, అంతేకాకుండా ఆడవాళ్ళ మాట వింటున్నాడు అని వెక్కిరించి, వెటకారం కూడా చేస్తారు. దాంతో సమాజంలో ఆడవాళ్ళ కి విలువ ఇవ్వడం అనేది ఒక తప్పు అయిపోయింది.
పైన చెప్పినట్టు అందరూ ఆడవాళ్లు తమకు విగ్రహాలు కట్టాలి, లేదా గొప్పగా చూడాలి అని అనుకోరు. ఆ వ్యక్తి విగ్రహం కట్టించారు అంటే అది ఆయనకి ఆయన భార్య మీద ఉన్న ప్రేమను, ఆయన తన భార్య కి ఇచ్చే విలువను తెలియజేస్తుంది. అలాగే ఆడవాళ్లందరూ కోరుకునేది ఒకటే. తమ కి విలువ ఇవ్వడం. ఆడా, మగా అన్న తేడా ని పక్కన పెట్టి అందరికీ సమానమైన ప్రాముఖ్యతనివ్వడం.
End of Article