ఒకప్పుడు ఇలియానా…తర్వాత సమంత…ఇప్పుడు పూజా హెగ్డే..! మరి నెక్స్ట్ ఎవరో?

ఒకప్పుడు ఇలియానా…తర్వాత సమంత…ఇప్పుడు పూజా హెగ్డే..! మరి నెక్స్ట్ ఎవరో?

by Mohana Priya

Ads

సాధారణంగా ప్రతీ డైరెక్టర్ సినిమా సినిమా కి డిఫరెన్స్ ఉండడం కోసం తీసుకునే ముఖ్య జాగ్రత్తల్లో కాస్టింగ్ ఒకటి. ముందు సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించిన వాళ్ళు ఈ సినిమాలో రిపీట్ అవ్వకుండా చూసుకుంటారు.

Video Advertisement

కానీ కొన్నిసార్లు కాస్టింగ్ ఛాయిస్ అనేది రిపీట్ అవుతుంది. అందుకు కారణం దర్శకుడు ఆ నటులతో కలిసి పని చేసిన ముందు సినిమాలో వాళ్ల పర్ఫామెన్స్ అవ్వచ్చు, లేదా సెంటిమెంట్ అయినా అవ్వచ్చు.

అలా త్రివిక్రమ్ కూడా తనతో పనిచేసిన హీరోయిన్లని మళ్లీ వేరే సినిమాలో ఎంపికచేశారు. జల్సా సినిమాలో ఇలియానా హీరోయిన్ అనే విషయం అందరికి తెలిసిందే. తర్వాత మళ్ళీ జులాయి సినిమాలో అల్లు అర్జున్ పక్కన జంటగా ఇలియానాని ఎంపిక చేశారు.

అలాగే అత్తారింటికి దారేది సినిమాలో సమంత హీరోయిన్. తర్వాత వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా మెయిన్ హీరోయిన్ సమంతనే. ఆ తర్వాత వచ్చిన అ ఆ లో కూడా హీరోయిన్ సమంత.

మళ్లీ అరవింద సమేత వీర రాఘవ లో హీరోయిన్ పూజ హెగ్డే. తర్వాత వచ్చిన అల వైకుంఠ పురం లో కూడా మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే. ఇలా త్రివిక్రమ్ తన సినిమాలో ముందు నటించిన హీరోయిన్ లని తర్వాత కూడా ఎంపిక చేసుకున్నారు. మరి అలా ఎంపిక చేసుకోవడం వెనుక కారణం ఏమిటో త్రివిక్రమ్ కే తెలియాలి.

అంతేకాకుండా సినిమాల్లో ఉండే కొన్ని ముఖ్య పాత్రలను కూడా త్రివిక్రమ్ మళ్ళీ రిపీట్ చేసారు. ఉదాహరణకి అత్తారింటికి దారేది సినిమాలో సమంతకు తల్లిగా నదియా నటించారు. అ ఆ లో కూడా సమంత తల్లి పాత్రలో నదియా పోషించారు. అలాగే జులాయి సినిమాలో రాజేంద్రప్రసాద్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. అల వైకుంఠపురం లో సినిమాలో కూడా రాజేంద్రప్రసాద్ మళ్లీ పోలీస్ పాత్రలోనే నటించారు.

ఒకసారి గమనిస్తే పైన రిపీట్ అయిన ముగ్గురు హీరోయిన్లు నటించిన సినిమాలు హిట్ అయ్యాయి. బహుశా ఆ సెంటిమెంట్ కూడా దృష్టిలో పెట్టుకొని హీరోయిన్ల ని ఎంపిక చేశారు ఏమో. భవిష్యత్తులో కూడా  త్రివిక్రమ్ సినిమాలో నటించిన హీరోయిన్ తో మళ్లీ ఇలా కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు ఏమో. చూద్దాం.


End of Article

You may also like