Ads
ఇండియా టీం కి ఎన్నో సేవలు అందించిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు నిన్న రాత్రి 7:29 కి అధికారికంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ వార్త అక్షరాలా ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచినప్పటికీ, అతను సరిగ్గా 7:29 PM IST టైం కి రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం ఏంటి అని ఎంతో మందికి డౌట్ వచ్చింది. ఆ టైం ధోనికి ఏమైనా స్పెషల్ ఆ అనే అనుమానాలు కూడా వచ్చాయి.
Video Advertisement
అయితే ఈ క్రమంలో బయటకొచ్చిన ఆసక్తికర విషయం ఏంటి అంటే…గత ఏడాది జూలై 9 న ఇదే సమయానికి టీమిండియా ప్రపంచ కప్ 2019 నుండి నాకౌట్ అయింది. ఎంఎస్ ధోని ఇదే మ్యాచ్‌లో చివరిసారిగా మైదానం నుండి దూరంగా నడిచాడు. మార్టిన్ గుప్టిల్ చేసిన రన్ అవుట్ తో పెవిలియన్ వైపు వెనుదిరిగాడు ధోని. చివరి ఓవర్లో యుజ్వేంద్ర చాహల్ వికెట్ కోల్పోవడంతో, మెగా ఈవెంట్ నుండి భారత్ తప్పుకుంది అప్పుడు సమయం 7:29 . న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ గ్రాంట్ ఇలియట్ ట్వీట్ లో ఆ సమయం మనం చూడచ్చు.
ఎప్పటిలాగే ధోని ఎలాంటి ప్రెస్ మీట్ గాని ఆర్భాటం గాని లేకుండా రిటైర్మెంట్ ప్రకటించారు. అతను అదే విధంగా 2014 లో టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు మరియు 2017 లో కూడా అదే పద్ధతిలో కెప్టెన్సీ నుండి వైదొలిగాడు. అయితే ఫాన్స్ అందరు అతన్ని ఐపీఎల్ లో చూసేందుకు ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 19 న ఐపిఎల్ మొదలవనుంది.
https://www.instagram.com/tv/CD6ZQn1lGBi/?utm_source=ig_web_copy_link
End of Article