ఎక్కువ మంది DISLIKE చేసిన ట్రైలర్… కానీ సడక్ 2 OTT రైట్స్ ఎంతకి అమ్ముడుపోయిందో తెలుసా?

ఎక్కువ మంది DISLIKE చేసిన ట్రైలర్… కానీ సడక్ 2 OTT రైట్స్ ఎంతకి అమ్ముడుపోయిందో తెలుసా?

by Mohana Priya

Ads

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం జనాల మీద చాలా ప్రభావం చూపింది అనే చెప్పాలి. ఇంతకుముందు వరకు నెపోటిజం గురించి సెలబ్రిటీలు మాట్లాడడమే తప్ప జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఏదో సినిమాలు చూసామా? నచ్చాయా లేదా? అంతవరకే ఉన్నారు. కానీ ఈ నెపోటిజం ఒక వ్యక్తి మరణానికి కారణం అయ్యింది అనే వార్తలు రావడంతో ప్రజలు కూడా నెపోటిజం గురించి మాట్లాడటం, తమ భావాలను వ్యక్తపరచడం మొదలు పెట్టారు.

Video Advertisement

అంతేకాకుండా అలా వారసత్వంతో వచ్చిన నటుల సినిమాలు చూడం అని బాయ్ కాట్ చేస్తున్నారు. దాంతో ఈ ప్రభావం సడక్ 2 సినిమా మీద పడింది. జాన్వీ కపూర్ నటించిన గుంజన్ సక్సేనా కొద్ది రోజుల క్రితం విడుదలైంది. జాన్వీ కపూర్ కూడా నెపోటిజం తో వచ్చిన నటే. అయినా కూడా ఆ సినిమాని ఎవరూ అంతగా పట్టించుకోలేదు.

కానీ ఇప్పుడు సడక్ 2 సినిమా ఎవరు చూడము అని సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నారు. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి ఈ సినిమా దర్శకుడు మహేష్ భట్. సుశాంత్, రియా విడిపోవడానికి మహేష్ భట్ కూడా ఒక కారణం అనే వార్తలు వచ్చాయి. ఇంకొక కారణం ఆలియా భట్.

ఒక షో లో సుశాంత్ గురించి ఆలియా అన్న మాటలు తప్పు అని, సరదాకి కూడా అలా ఒక వ్యక్తి గురించి మాట్లాడి ఉండకూడదు అని ప్రజలు అంటున్నారు. దాంతో సడక్ 2 సినిమా పై అందరూ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. దాదాపు 11 మిలియన్ల డిస్ లైక్ లతో మోస్ట్ డిస్ లైక్డ్ ట్రైలర్ అయింది. ఇప్పుడు సినిమా కూడా ఆగస్టు 28న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల అవ్వనుంది.

సడక్ 2 సినిమా బడ్జెట్ దాదాపు 35 కోట్లు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు దాదాపు 65 కోట్లకు కొన్నారు అని సమాచారం. కానీ ఇప్పుడు యూట్యూబ్ లో ఈ సినిమా పై వస్తున్న నెగిటివ్ కామెంట్లను చూసి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాజమాన్యం కూడా అసలు జనాలు సినిమా చూస్తారా లేదా అనే ఆందోళనలో ఉన్నారట.

ఇటీవల విడుదలైన గుంజన్ సక్సేనా సినిమా లో జాన్వీ కపూర్ నటన తప్ప మిగిలినది అంతా బాగుంది అని నెటిజన్లు రివ్యూ ఇచ్చారు. ఇప్పుడు సడక్ 2 కథ ఎలా ఉండబోతోందో, ప్రేక్షకులు సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారో, గుంజన్ సక్సేనా సినిమా కి వచ్చినట్టే ఈ సినిమాకి కూడా మిక్సిడ్ రివ్యూస్ వస్తాయో, ఇవన్నీ తెలియాలంటే సినిమా విడుదలైయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.


End of Article

You may also like