ఇండియన్ రైల్వేస్ సూపర్ ప్లాన్…ఈ “అనకొండ ట్రైన్” ప్రత్యేకత ఏంటో చూడండి!

ఇండియన్ రైల్వేస్ సూపర్ ప్లాన్…ఈ “అనకొండ ట్రైన్” ప్రత్యేకత ఏంటో చూడండి!

by Mohana Priya

Ads

ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఎన్ని వచ్చినా కూడా ట్రైన్ ప్రయాణంలో ఉన్న సౌకర్యమే వేరు. దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల ప్రదేశాలను చూస్తూ ఆహ్లాదంగా ప్రయాణించడానికి ఎంతో మంది ఇష్టపడతారు. ట్రైన్ అలానే వెళుతుంది కాబట్టి చాలామంది ట్రైన్ కి ప్రాముఖ్యతను ఇస్తారు.

Video Advertisement

అందుకే ఇప్పటికి కూడా ట్రైన్ రవాణా స్థిరంగా కొనసాగుతోంది. కరోనా కారణంగా ఎవరు ఒక చోట నుండి మరొక చోటికి ప్రయాణం చేయటం లేదు కాబట్టి ట్రైన్ లు నడవడం ప్రస్తుతానికి ఆగింది. మనుషులు వెళ్లడం ఆగిపోయి ఉండవచ్చు కానీ వస్తువులు సరఫరా మాత్రం ఆగదు.

అంటే మామూలు రైలు నడవట్లేదు కానీ గూడ్స్ బండి నడుస్తోంది. ఒక గూడ్స్ రైలుకి నలభై నుండి యాభై బోగీలు ఉంటాయి. ఒక గూడ్స్ రైలు నడవాలి అంటే పెట్రోల్, డీజిల్ తో పాటు మాన్ పవర్ కూడా చాలా అవసరం.

ప్రతి ఒక్క రైలు వేరు వేరు సమయంలో నడుస్తుంది. దాంతో పెట్రోల్, డీజిల్ కూడా బాగానే ఖర్చు అవుతాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అలా వేరు వేరుగా రైళ్ళను నడిపిస్తూ అంత ఇంధనాన్ని వృధా చేయడం సరైనది కాదు అని అనుకున్న రైల్వే శాఖ యాజమాన్యం ఒక వినూత్నమైన ఆలోచన తో ముందుకొచ్చారు.

మార్చి నెలలో ఈస్ట్ కోస్ట్ రైల్వే మూడు  గూడ్స్  రైళ్లని అంటే దాదాపు 147 బోగీలను కలిపి గోడ్‌భ‌గ‌ – బాలాంగిర్ రైల్వేస్టేష‌న్ల మధ్యలో న‌డిపింది. ఈ ప్రయోగం విజయవంతం అయింది. దాంతో సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే కూడా ఇలాగే దాదాపు 177 బోగీలను కలిపి ఒకటే రైలు లాగా తయారు చేశారు. ఈ రైలు పొడవు దాదాపు రెండు కిలోమీటర్ల వరకు ఉందట. అందుకే ఈ రైలుని అనకొండ ట్రైన్, ఇంకా పైథాన్ ట్రైన్ అనే పేర్లతో పిలుస్తున్నారు.

కానీ ఇది సాధ్యమయింది కరోనా కారణంగానే. ఎందుకంటే కరోనా కారణంగా ఎవరు బయటికి రావట్లేదు కాబట్టి రైళ్లు తిరగడం లేదు. ఎక్కువ రైలు లేవు కాబట్టి ఇలాంటి ప్రయోగం చేయగలిగారు. ఏదేమైనా సరే ఎటువంటి ఆలోచన వచ్చినందుకు రైల్వే యాజమాన్యాన్ని అభినందించకుండా ఉండలేం కదా?


End of Article

You may also like