Ads
ఈ లాక్ డౌన్ సమయంలో సీరియల్స్ లేక, మొదలైనవి కూడా మళ్లీ ఆగిపోయి, రిపీటెడ్ ఎపిసోడ్ లతో, చాలా మందికి బోర్ కొడుతోంది. వీడియో కాల్స్ ద్వారా ఇంటర్వ్యూ తీసుకుంటూ చేసిన కొత్త షోస్ కూడా ఏవి అంతగా అలరించలేకపోయాయి. ఇలాంటి సమయంలో ఎడారిలో ఒక్క చినుకు వర్షం పడినట్టు సడన్ గా ఇటీవల మా టీవీ యాజమాన్యం బిగ్ బాస్ ఫోర్ ప్రోమో విడుదల చేసింది.
Video Advertisement
అసలు మామూలుగానే బిగ్ బాస్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. అది కూడా ఇలాంటి సమయంలో షో స్టార్ట్ అయితే ఇంక టి ఆర్ పి ఏ రేంజ్ లో ఉంటుందో ముందే ఊహించుకోవచ్చు. గత సీజన్ లో తన హోస్టింగ్ తో అలరించిన కింగ్ నాగార్జున ఈ సీజన్ లో కూడా వారం వారం కంటెస్టెంట్ ల పనిపట్టే బాధ్యతను తీసుకున్నారు. ఈసారి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టబోయే కంటెస్టెంట్ లు వీరే అంటూ ఎంతో మంది పేర్లు వినిపిస్తున్నాయి.
బిగ్ బాస్ మొదలవడానికి ఇంకా కొద్దిరోజులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కన్ఫామ్ అయిన కంటెస్టెంట్స్ అని కొంత మంది సెలబ్రిటీల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అందులో నటుడు నందు పేరు కూడా ఉంది. ఈలోపు నందు తన సోషల్ మీడియాలో “big announcement “, Guys I am in BB, BB lo mana rachha mamoologa undadu” . అంటూ పోస్టులు పెట్టడంతో బిగ్ బాస్ 4 లో నందు ఒక కంటెస్టెంట్ అనుకున్నారు అందరు. కానీ నందు ట్విస్ట్ ఇచ్చారు.
End of Article