Ads
బాహుబలి తరువాత రాజమౌళి చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ తెలిసిందే..మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం.అల్లూరి సీతారామరాజు,కొమరం భీం పాత్రలలో నటిస్తున్న రామ్ చరణ్ ,ఎన్టీఆర్ లు..రామ్ చరణ్ కి జోడీగా అలియా ఎన్టీఆర్ కి జోడిగా ఒలీవియా మోరిస్ లను ఎంచుకున్న జక్కన్న.ఇప్పటికే డెబ్బయి శాతం షూటింగ్ ని పూర్తి చేసిన యూనిట్..కరోనా వలన విధించిన లాక్ డౌన్ కారణముగా షూటింగ్స్ వాయిదా పడటంతో చిత్రీకరణకు కి అంతరాయం కలిగింది.
Video Advertisement
ఇక ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం జనాల మీద చాలా ప్రభావం చూపింది అనే చెప్పాలి. ఇంతకుముందు వరకు నెపోటిజం గురించి సెలబ్రిటీలు మాట్లాడడమే తప్ప జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఏదో సినిమాలు చూసామా? నచ్చాయా లేదా? అంతవరకే ఉన్నారు. కానీ ఈ నెపోటిజం ఒక వ్యక్తి మరణానికి కారణం అయ్యింది అనే వార్తలు రావడంతో ప్రజలు కూడా నెపోటిజం గురించి మాట్లాడటం, తమ భావాలను వ్యక్తపరచడం మొదలు పెట్టారు.
అంతేకాకుండా అలా వారసత్వంతో వచ్చిన నటుల సినిమాలు చూడం అని బాయ్ కాట్ చేస్తున్నారు. దాంతో ఈ ప్రభావం సడక్ 2 సినిమా మీద పడింది. జాన్వీ కపూర్ నటించిన గుంజన్ సక్సేనా కొద్ది రోజుల క్రితం విడుదలైంది. జాన్వీ కపూర్ కూడా నెపోటిజం తో వచ్చిన నటే. అయినా కూడా ఆ సినిమాని ఎవరూ అంతగా పట్టించుకోలేదు.
కానీ ఇప్పుడు సడక్ 2 సినిమా ఎవరు చూడము అని సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నారు. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి ఈ సినిమా దర్శకుడు మహేష్ భట్. సుశాంత్, రియా విడిపోవడానికి మహేష్ భట్ కూడా ఒక కారణం అనే వార్తలు వచ్చాయి. ఇంకొక కారణం ఆలియా భట్.
ఒక షో లో సుశాంత్ గురించి ఆలియా అన్న మాటలు తప్పు అని, సరదాకి కూడా అలా ఒక వ్యక్తి గురించి మాట్లాడి ఉండకూడదు అని ప్రజలు అంటున్నారు. దాంతో సడక్ 2 సినిమా పై అందరూ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. దాదాపు 11 మిలియన్ల డిస్ లైక్ లతో మోస్ట్ డిస్ లైక్డ్ ట్రైలర్ అయింది. ఇప్పుడు సినిమా కూడా ఆగస్టు 28న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల అవ్వనుంది.
ఎక్కువ మంది డిస్లైక్ చేసిన ట్రైలర్ గా సడక్ 2 రికార్డ్ సాధించడంతో ఆర్ ఆర్ ఆర్ టీం అలియా భట్ ని సినిమా నుండి తీసెయ్యాలా అనే ఆలోచనలో పడ్డారంటే. అలియా భట్ ఈ సినిమా నుండి తప్పుకున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి.
దీంతో ఆర్ ఆర్ ఆర్ టీం అలియా భట్ స్థానంలో “ప్రియాంక చోప్రా” ని ఎంపిక చేసినట్టు వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో ఆ టీం ఆఫీసియల్ అప్డేట్ ఇచ్చేవరకు వెయిట్ చేయాలి.
End of Article