Ads
ఎన్నో రోజుల చర్చ తర్వాత ఎట్టకేలకు సుప్రీంకోర్టు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు సిబిఐకి అప్పగించింది. సిబిఐ దర్యాప్తులో ఇప్పటివరకు వెలుగులోకి రాని ఎన్నో విషయాలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. రియా చక్రవర్తి మీద ముందునుండి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. తాజాగా రియా చక్రవర్తి ఒక డ్రగ్ డీలర్ తో చేసిన వాట్సాప్ చాట్ బయటికి వచ్చింది.
Video Advertisement
రియా చక్రవర్తి గౌరవ్ ఆర్య అనే ఒక డ్రగ్ డీలర్ తో మిథైలిన్ డైఆక్సీ మెథం ఫెటమిన్ (MDMA) అనే డ్రగ్ గురించి అడిగారు. ఈ డ్రగ్ చాలా ప్రమాదకరమైనదట. ఇదంతా ఈడి అధికారుల దృష్టికి వచ్చింది. “పవర్ ఎక్కువగా ఉన్న డ్రగ్స్ గురించి మాట్లాడాలి (హార్డ్ డ్రగ్స్). ఇప్పటివరకు నేను ఎక్కువగా వాడలేదు” అని అర్థం వచ్చేలా ఆ సంభాషణ ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చాటింగ్ మార్చి 2017 లో జరిగింది.
ఇది ఇలా ఉండగా…మహేష్ బట్,రియా చక్రబోర్తి కలిసి ఒకరి బుజాల మీద ఒకరు వాలుతూ తీసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.మహేష్ బట్ పుట్టినరోజు సందర్భంగా రియా చక్రబోర్తి ఆ ఫోటోలను షేర్ చేస్తూ “హ్యాపీ బర్త్ డే మై బుద్ధ” అని రాసారు .
ఇప్పుడు మహేష్ భట్ కి సంబంధించి మరో వార్త కూడా వైరల్ అవుతుంది.
అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన బాలీవుడ్ హీరోయిన్ జియాఖాన్తో మహేష్ భట్ అతి సన్నిహితంగా ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది. అప్పుడు జియా వయసు పదహారు సంవత్సరాలు మాత్రమే.
End of Article