Ads
కోల్కతా లో ఉన్న అశుతోష్ కాలేజ్ లో ఇంగ్లీష్ లో బి.ఏ ఆనర్స్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ గురువారం నాడు వాళ్ళ వెబ్సైట్లో ప్రకటించారు. ఆ లిస్టు లో ప్రముఖ నటి సన్నీ లియోన్ టాపర్ ల జాబితాలో ఉన్నారు.
Video Advertisement
వెస్ట్ బెంగాల్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుండి సన్నీ లియోన్ అప్లికేషన్ ఐడి 9513008704, ఇంకా రోల్ నంబర్ 207777-6666 తో 2020 లో పాస్ అయినట్టు ఆ లిస్టు లో ఉంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ మెరిట్ లిస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
అంతేకాకుండా 12వ తరగతి బోర్డు పరీక్షల్లో బెస్ట్ ఫోర్ సబ్జెక్టులలో పూర్తి మార్కులు (400) సాధించినట్లు ఉంది. దాంతో విద్యార్థులతో పాటు కాలేజ్ యాజమాన్యం కూడా ఆశ్చర్యపోయారు. దీనిపై కాలేజీ యాజమాన్యం స్పందించి ఇదంతా ఎవరో కావాలని చేసిన పని అని, కావాలనే తప్పుడు అప్లికేషన్ సబ్మిట్ చేశారని,
ఇప్పుడు పేరు సరిచేయమని అడ్మిషన్ డిపార్ట్మెంట్ ని అడిగామని కానీ ఏదేమైనా ఈ పని చేసిన వాళ్ళ పై మాత్రం చర్యలు తీసుకుంటామని అన్నారు. తర్వాత సన్నీ లియోన్ పేరు స్థానంలో ఏబిసి (ABC) అని మార్చారట.
సన్నీ లియోన్ పేరు ఇలా వార్తల్లోకి రావడం ఇది మొదటిసారి కాదు. అంతకుముందు కూడా 2019 లోక్ సభ ఎలక్షన్ల సమయంలో ఒక టీవీ యాంకర్ సన్నీ డియోల్ పేరు చెప్పబోయి పొరపాటుగా సన్నీలియోన్ అని అన్నారు.
End of Article