“సురేష్ రైనా” ఇండియా తిరిగి రావడానికి కారణం తెలుసా? ఇంటిపై దాడి జరగడం?

“సురేష్ రైనా” ఇండియా తిరిగి రావడానికి కారణం తెలుసా? ఇంటిపై దాడి జరగడం?

by Mohana Priya

Ads

చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ సురేష్ రైనా శనివారం నాడు భారతదేశానికి తిరిగి ప్రయాణం అయ్యారు. ఇందుకు కారణం సురేష్ రైనా వ్యక్తిగత సమస్యలట. జాగరణ్ కథనం ప్రకారం సురేష్ రైనా బంధువుల లో ఒకరు క్రిటికల్ కండిషన్ లో ఉన్నారట.

Video Advertisement

పటాన్ కోట్ లోని థరియాల్ లో నివసించే ఇంకొక బంధువుపై దాడి జరిగిందట. ఈ ఘటన ఆగస్టు 19వ తేదీ రోజు జరిగిందట. సురేష్ రైనా బంధువులు టెర్రస్ పై పడుకున్నప్పుడు అర్ధరాత్రి సమయంలో  ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆయుధాలతో వచ్చి దాడికి పాల్పడ్డారట.

దెబ్బలు బాగా తగలడంతో సురేష్ రైనా బంధువు మరణించారట. సురేష్ రైనా కి సోదరుల వరస అయిన వాళ్ళకి (కజిన్స్) కి ఇద్దరికి ఈ దాడిలో గాయాలు అయ్యాయట. సురేష్ రైనా తండ్రి సోదరి అయిన ఆశా దేవి ఆరోగ్యం విషమంగా ఉందట.

ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కె ఎస్ విశ్వనాథన్ “కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సురేష్ రైనా భారతదేశానికి తిరిగి ప్రయాణం అవుతున్నారని, చెన్నై సూపర్ కింగ్స్ బృందం సురేష్ రైనా కి, ఇంకా తన కుటుంబానికి సహకారాన్ని అందిస్తున్నాము” అని ట్వీట్ చేశారు.

చెన్నై సూపర్ కింగ్స్ బృందంలో కొంతమందికి కరోనా సోకడం, అంతేకాకుండా సురేష్ రైనా కి రిప్లేస్మెంట్ ప్లేయర్ కూడా దొరకడం అనేది చాలా కష్టమైన విషయం కావడంతో ప్రస్తుతం బిసిసిఐ ఆందోళనలో ఉంది.


End of Article

You may also like