సమీర్ అలా అన్నందుకు ట్రోల్ చేసారు…కానీ ఆ ఆఫర్ రావడం నిజమే అంట.! అసలేమైంది?

సమీర్ అలా అన్నందుకు ట్రోల్ చేసారు…కానీ ఆ ఆఫర్ రావడం నిజమే అంట.! అసలేమైంది?

by Mohana Priya

Ads

యూట్యూబ్ లో టిఎన్ఆర్ ఇంటర్వ్యూస్ కి చాలా క్రేజ్ ఉంటుంది. ఇంటర్వ్యూలు ఎక్కువ సేపు ఉన్నా కూడా ఒక సెలబ్రిటీ ని దాదాపు అన్ని కోణాల్లో ఇంటర్వ్యూ చేస్తారు. అప్పటివరకు ఏ సెలబ్రిటీ ఎక్కడ చెప్పని విషయాలు కూడా టిఎన్ఆర్ ఇంటర్వ్యూ లో చెప్తారు.

Video Advertisement

ఇటీవల టిఎన్ఆర్ తో ప్రముఖ నటుడు,ఇంకా బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్ సమీర్ మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ లో టిఎన్ఆర్ అడిగిన ఒక ప్రశ్న కి సమీర్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ రూపంలో వైరల్ అవుతోంది.  అదేంటంటే సమీర్ వాళ్ళ బాబుని జాన్సన్ బేబీ వాళ్ళు పోస్టర్ బేబీ కోసం అడిగారు కదా?  ఎంత ఆఫర్ ఇచ్చారు ఎందుకు వదులుకున్నారు? అని టిఎన్ఆర్ సమీర్ ని ప్రశ్నించారు.

అందుకు సమీర్ “అవును అడిగారు. రెండు రోజులకి 75 లక్షలు ఇస్తామన్నారు. కానీ నా భార్య వాళ్ల తల్లిదండ్రులకు ఇది ఇష్టం లేదు. దిష్టి తగులుతుంది ఎందుకులే అన్నారు. అందుకే ఒప్పుకోలేదు” అని సమాధానం చెప్పారు. ఇదంతా సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో సర్క్యులేట్ అయ్యి టిఎన్ఆర్ దృష్టి వరకు వెళ్ళింది. దాంతో టిఎన్ఆర్ ఫేస్ బుక్ లో ఈ విధంగా స్పందించారు.

“సమీర్ ఇంటర్వ్యూ మీద వచ్చిన ట్రోల్స్ లో నాకు బాగా నచ్చిన ట్రోల్ ఇది . ఇంటర్వ్యూలో చాలా మందికి ఈ విషయం దగ్గర క్లారిటీ దొరకలేదు. కొంతమంది సమీర్ వాళ్ళ అబ్బాయికి వచ్చిన 75లక్షల జాన్సన్ & జాన్సన్ ప్యాకేజ్ ని నమ్మలేదు. అందుకే ఈ ట్రోల్స్ వచ్చాయ్.

తప్పేం లేదు.బట్ అలా అపార్థం చేసుకున్న వాళ్ళకి ఒక ఇంటర్వ్యూయర్ గా క్లారిటీ ఇవ్వడం నా బాధ్యత అనిపించి ఈ పోస్ట్ పెడుతున్నాను. నిజంగానే జాన్సన్ నుండి సమీర్ వాళ్ళ అబ్బాయికి అంత పెద్ద ప్యాకేజ్ వచ్చింది. సమీర్ తన వ్యక్తిగత కారణాల వలన కొంచెం ఇబ్బందిగానే ఆ ఆఫర్ ని రిజెక్ట్ చెయ్యడం జరిగింది.

కానీ కొన్ని కారణాల వలన ఇంటర్వ్యూలో కారణం పూర్తిగా చెప్పకుండా పై పైన చెప్పడం జరిగింది. అది వివరించడం వలన అనవసరపు లేనిపోని ప్రాబ్లంస్ వస్తాయని పూర్తిగా చెప్పలేదు. నేను కూడా తనని బలవంతం చెయ్యలేదు.
అందు వల్ల కొంతమంది అపార్థం చేసుకోవడం జరిగింది.

బట్ 75లక్షల ఆఫర్ రావడం అన్నది అతిశయోక్తి లేకుండా పూర్తిగా నిజం.
నమ్మాలి. బట్, ఈ టాపిక్ మీద వచ్చిన ఈ కింది (ఈ పారాగ్రాఫ్ పైన ఉన్న ఫోటో) ట్రోలింగ్ మాత్రం బాగా ఎంజాయ్ చేశా. సమీర్ కి ఫార్వార్డ్ చేస్తే తనూ బాగా ఎంజాయ్ చేశాడు” అని పోస్ట్ చేశారు టిఎన్ఆర్. దాంతో పాటు తను బాగా ఎంజాయ్ చేశాను అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న ఈ ట్రోల్ కూడా ఈ పోస్ట్ చేశారు.

watch full interview:


End of Article

You may also like