కూతుర్ని తోసేసి బిల్డింగ్ పైనుండి దూకి చనిపోయిన మనోజ్ఞ కేసు…కరోనా పరీక్ష చేయగా రిపోర్ట్ లో?

కూతుర్ని తోసేసి బిల్డింగ్ పైనుండి దూకి చనిపోయిన మనోజ్ఞ కేసు…కరోనా పరీక్ష చేయగా రిపోర్ట్ లో?

by Mohana Priya

Ads

గుంటూరు లో లక్ష్మీపురం లో ఇటీవల ఒక ఘటన చోటు చేసుకుంది. మనోజ్ఞ అనే ఒక యువతి తన తొమ్మిది నెలల పాప తులసిని అపార్ట్మెంట్ పై నుండి కింద పడేసి, తర్వాత మనోజ్ఞ కూడా దూకి చనిపోయారు అని సమాచారం. కానీ దీనిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Video Advertisement

తమ కూతురిని తన భర్తతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు కూడా వేధింపులకు గురి చేసేవారు అని మనోజ్ఞ తల్లిదండ్రులు తెలిపారు. పోలీసులు మనోజ్ఞ భర్త కళ్యాణ్ చక్రవర్తి ని, అత్త మామలు శ్రీమన్నారాయణ, కామేశ్వరి లను ఆదివారం నాడు అదుపులోకి తీసుకున్నారు.

కానీ మనోజ్ఞ భర్త కళ్యాణ్ చక్రవర్తి తన భార్య ఎందుకు మరణించిందో కారణాలు తెలియదు అని, తను ఆమెను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు అని చెప్పారు. గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసులు కళ్యాణ్ చక్రవర్తి తోపాటు అతని తల్లిదండ్రుల పై వరకట్నం వేధింపుల కేసు నమోదు చేశారు.

ఘటన జరిగిన స్థలంలో ఎలాంటి ఆనవాళ్లు లేవు అని మనోజ్ఞ తమ్ముడు కార్తీక్ చెప్తున్నారు. అంతేకాకుండా పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి అని మనోజ్ఞ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.ఆదివారం ఉదయం మనోజ్ఞ మృతదేహానికి డాక్టర్లు కరోనా పరీక్ష చేశారు. రిపోర్ట్ పాజిటివ్ వచ్చినట్టు డాక్టర్లు మీడియాతో తెలిపారు.

 


End of Article

You may also like