ఆ ట్వీట్ లో కేదార్ జాదవ్ అన్నది “రైనా” గురించేనా? ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేశాడా?

ఆ ట్వీట్ లో కేదార్ జాదవ్ అన్నది “రైనా” గురించేనా? ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేశాడా?

by Mohana Priya

Ads

చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ సురేష్ రైనా శనివారం నాడు భారతదేశానికి తిరిగి ప్రయాణం అయ్యారు. ఇందుకు కారణం సురేష్ రైనా వ్యక్తిగత సమస్యలట. జాగరణ్ కథనం ప్రకారం సురేష్ రైనా బంధువుల లో ఒకరు క్రిటికల్ కండిషన్ లో ఉన్నారట.

Video Advertisement

పటాన్ కోట్ లోని థరియాల్ లో నివసించే ఇంకొక బంధువుపై దాడి జరిగిందట. దెబ్బలు బాగా తగలడంతో సురేష్ రైనా బంధువు మరణించారట. సురేష్ రైనా తండ్రి సోదరి అయిన ఆశా దేవి ఆరోగ్యం విషమంగా ఉందట. అంతేకాకుండా సురేష్ రైనా ఇండియాకి తిరుగు ప్రయాణం అవ్వడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి అని అంటున్నారు.

క్రిక్ ట్రాకర్ కథనం ప్రకారం సురేష్ రైనా కి యాజమాన్యం ఇచ్చిన రూమ్ నచ్చలేదట. బయో బబుల్ ప్రోటోకాల్ పాటించడం కష్టం గా అనిపించిందట. మహేంద్ర సింగ్ ధోని కి ఇచ్చిన రూమ్ లాంటి రూమ్ కావాలి అని సురేష్ రైనా అనుకున్నారట. సురేష్ రైనా ఉండే రూమ్ కి బాల్కనీ సరిగా లేదట. అది కొంచెం ఇబ్బందిగా అనిపించిందట.

దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్ మాట్లాడుతూ “క్రికెటర్లందరూ ప్రిమా డోనాస్ లాంటివారు. పాత కాలంలో ఉండే టెంపర్మెంటల్ యాక్టర్స్ లాగా అన్నమాట. నా ఆలోచన ఏంటంటే ఒకవేళ మీకు ఏదైనా నచ్చకపోతే, మీరు దేని వల్ల అయినా సంతోషంగా లేకపోతే, తిరిగి వెళ్లిపోండి. ఒక్కొక్కసారి విజయం తల పైకి ఎక్కుతుంది.

 

నేను మహేంద్ర సింగ్ ధోనీ తో మాట్లాడాను. ఒకవేళ పాజిటివ్ వచ్చిన వాళ్ళ సంఖ్య పెరిగినా కూడా భయపడాల్సిన అవసరం లేదు అని హామీ ఇచ్చారు. ప్లేయర్లందరితో జూమ్ కాల్ లో మాట్లాడారు. ఈ సీజన్ ఇంకా ప్రారంభం అవ్వలేదు. అయినా తను ఏం కోల్పోతున్నారు అనే విషయం సురేష్ రైనా తెలుసుకుంటారు” అని అన్నారు.

శ్రీనివాసన్ ఇలా బహిరంగంగా మాట్లాడిన తర్వాత, ఇప్పుడు కేదార్ జాదవ్ కూడా ట్విట్టర్ వేదికగా ఒక కామెంట్ చేశారు. అది డైరెక్ట్ గా సురేష్ రైనా గురించి అని చెప్పకపోయినా కూడా ట్వీట్ చూస్తే సురేష్ రైనా ని ఉద్దేశించి చేసిన ట్వీట్ అని అంటున్నారు నెటిజన్లు.

ఆ ట్వీట్ లో ” ముందుకు వెళ్లే క్రమంలో ఒక్కొక్కసారి వదిలేయడానికి వెయ్యి సాకులు అయినా వెతుకుతాం, కానీ పట్టు విడువకుండా ఉండడానికి ఒక్క కారణం చాలు. ఏదైనా మీరు ఎంచుకోవడంలోనే ఉంది” అని ఆ ట్వీట్ సారాంశం.


End of Article

You may also like