Ads
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ సురేష్ రైనా గత శనివారం నాడు భారతదేశానికి తిరిగి ప్రయాణం అయ్యారు. ఇందుకు కారణం సురేష్ రైనా వ్యక్తిగత సమస్యలట. జాగరణ్ కథనం ప్రకారం సురేష్ రైనా బంధువుల లో ఒకరు క్రిటికల్ కండిషన్ లో ఉన్నారట.
Video Advertisement
పటాన్ కోట్ లోని థరియాల్ లో నివసించే ఇంకొక బంధువుపై దాడి జరిగిందట. ఈ ఘటన ఆగస్టు 19వ తేదీ రోజు జరిగిందట. సురేష్ రైనా బంధువులు టెర్రస్ పై పడుకున్నప్పుడు అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆయుధాలతో వచ్చి దాడికి పాల్పడ్డారట.
దెబ్బలు బాగా తగలడంతో సురేష్ రైనా బంధువు మరణించారట. సురేష్ రైనా కి సోదరుల వరస అయిన వాళ్ళకి (కజిన్స్) కి ఇద్దరికి ఈ దాడిలో గాయాలు అయ్యాయట. సురేష్ రైనా తండ్రి సోదరి అయిన ఆశా దేవి ఆరోగ్యం విషమంగా ఉందట. కానీ సురేష్ రైనా ఇండియా కి వెనక్కి తిరిగి రావడానికి గల కారణం ఇది మాత్రమే కాదు అనే వార్తలు వినిపించాయి.
క్రిక్ ట్రాకర్ కథనం ప్రకారం సురేష్ రైనా కి యాజమాన్యం ఇచ్చిన రూమ్ నచ్చలేదట. బయో బబుల్ ప్రోటోకాల్ పాటించడం కష్టం గా అనిపించిందట. మహేంద్ర సింగ్ ధోని కి ఇచ్చిన రూమ్ లాంటి రూమ్ కావాలి అని సురేష్ రైనా అనుకున్నారట. సురేష్ రైనా ఉండే రూమ్ కి బాల్కనీ సరిగా లేదట. అది కొంచెం ఇబ్బందిగా అనిపించిందట.
ఈ విషయంపై నచ్చచెప్పడంలో మహేంద్ర సింగ్ ధోని విఫలమయ్యారట. అంతేకాకుండా చెన్నై సూపర్ కింగ్స్ బృందంలో దాదాపు 13 మందికి (స్టాఫ్ సిబ్బంది తో కలిపి) కరోనా పాజిటివ్ రావడంతో మహేంద్ర సింగ్ ధోనీ భయం మరింత పెరిగింది అని సమాచారం.
దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్ మాట్లాడుతూ “క్రికెటర్లందరూ ప్రిమా డోనాస్ లాంటివారు. పాత కాలంలో ఉండే టెంపర్మెంటల్ యాక్టర్స్ లాగా అన్నమాట. నా ఆలోచన ఏంటంటే ఒకవేళ మీకు ఏదైనా నచ్చకపోతే, మీరు దేని వల్ల అయినా సంతోషంగా లేకపోతే, తిరిగి వెళ్లిపోండి. ఒక్కొక్కసారి విజయం తల పైకి ఎక్కుతుంది.
నేను మహేంద్ర సింగ్ ధోనీ తో మాట్లాడాను. ఒకవేళ పాజిటివ్ వచ్చిన వాళ్ళ సంఖ్య పెరిగినా కూడా భయపడాల్సిన అవసరం లేదు అని హామీ ఇచ్చారు. ప్లేయర్లందరితో జూమ్ కాల్ లో మాట్లాడారు. ఈ సీజన్ ఇంకా ప్రారంభం అవ్వలేదు. అయినా తను ఏం కోల్పోతున్నారు అనే విషయం సురేష్ రైనా తెలుసుకుంటారు” అని అన్నారు.
ఈ కథనాలపై సురేష్ రైనా స్పందించారు. క్రిక్ ట్రాకర్ కథనం ప్రకారం క్రిక్ బజ్ (Cricbuzz) తో సురేష్ రైనా మాట్లాడుతూ ” శ్రీనివాసన్ నాకు తండ్రి లాంటి వారు. నేను సమస్యలు ఎదుర్కొన్నప్పుడు కూడా నాకు సపోర్ట్ ఇచ్చారు. నన్ను తన చిన్న కొడుకు లాగా భావిస్తారు. ఆయన నా గురించి మాట్లాడిన మాటల అర్థం తప్పుగా వచ్చింది. ఒక తండ్రి ఒక కొడుకుని అన్నట్టే ఆయన నా గురించి చెప్పారు.
ఆయన అలా మాట్లాడినప్పుడు నేను సడన్ గా యూఏఈ నుండి భారతదేశానికి రావడానికి గల కారణం తెలియదు. తర్వాత అసలు కారణం ఏంటి అనేది తెలుసుకున్నారు. నాకు మెసేజ్ కూడా చేశారు. మేము మాట్లాడుకున్నాం. నాకు, ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి ఇంక ఈ విషయం నుండి బయటికి రావాలి (ఈ విషయం ఇక్కడితో ఆపేయాలి) అని అనిపించింది” అని అన్నారు.
End of Article