Ads
తొలిప్రేమ సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించింది అనే విషయం అందరికీ తెలుసు. ఒకటి కాదు, రెండు కాదు, చెప్పాలంటే ఈ సినిమాలో చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయి. అందుకే సినిమా వచ్చి 20 ఏళ్లు దాటినా కూడా క్రేజ్ ఇంకా తగ్గలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా ఒక కల్ట్ క్లాసిక్ అనొచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి స్టార్ డం తీసుకు వచ్చిన సినిమా తొలిప్రేమ.
Video Advertisement
ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మరొక వ్యక్తి హీరోయిన్ కీర్తి రెడ్డి. 1996 లో వచ్చిన గన్ షాట్ సినిమా కీర్తి రెడ్డి మొదటి చిత్రం. తర్వాత 1998 లో తొలిప్రేమ సినిమాలో నటించారు కీర్తి రెడ్డి. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా నటించారు.
2004లో వచ్చిన అర్జున్ సినిమాలో మహేష్ బాబు సోదరి గా నటించారు కీర్తి రెడ్డి. అదే కీర్తి రెడ్డి చేసిన చివరి సినిమా. ప్రస్తుతం కీర్తి రెడ్డి పెళ్లి చేసుకొని యూఎస్ లో సెటిల్ అయ్యారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారట.
కీర్తి రెడ్డి బంధువులు కూడా నటులే. నటుడు సామ్రాట్ కీర్తి రెడ్డి కి తమ్ముడి వరస అవుతారట. సామ్రాట్ కొంచెం ఇష్టం కొంచెం కష్టం, అహ నా పెళ్ళంట, పంచాక్షరి, బావ, దేనికైనా రెడీ, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, వైఫ్ ఆఫ్ రామ్ ఇలా ఎన్నో చిత్రాల్లో నటించారు. బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నారు సామ్రాట్. ఆ సీజన్ లో ఫైనల్ కి వెళ్ళిన మొదటి కంటెస్టెంట్ గా సామ్రాట్ నిలిచారు.
సామ్రాట్ అసలు పేరు గూడూరు వెంకట సత్య కృష్ణ రెడ్డి అట. ఫిలిం మేకింగ్ కోర్స్ లో లో డిగ్రీ కూడా పొందారట సామ్రాట్. సామ్రాట్ మంచి క్రికెటర్ కూడా. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ టీం తరపున ఎన్నోసార్లు ఆడారు సామ్రాట్.
End of Article