చైనీస్ యాప్ “పబ్ జి” బ్యాన్ అవ్వడం వల్ల ఆ కంపెనీ ఎన్ని కోట్లు నష్టపోయిందో తెలుసా?

చైనీస్ యాప్ “పబ్ జి” బ్యాన్ అవ్వడం వల్ల ఆ కంపెనీ ఎన్ని కోట్లు నష్టపోయిందో తెలుసా?

by Mohana Priya

Ads

అయిపోయింది. ఏదైతే అవ్వకూడదు అని భయపడుతున్నామో, అదే అయిపోయింది. పబ్ జి బ్యాన్ చేయాలని గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేసింది. పబ్ జి అనేది కేవలం ఒక గేమ్ మాత్రమే కాదు. ఇది చాలా మందికి కొంత కాలం నుండి ఒక ఎమోషన్ అయింది. కొంతమందికి ఎక్కువ మంది స్నేహితులు ఉండరు. అలాంటి వాళ్లకి పబ్ జి ఎంతోమంది స్నేహితులను పరిచయం చేసింది.తిండి, నిద్ర కూడా త్యాగం చేసి పబ్ జి ఆడే వాళ్లు చాలామంది ఉన్నారు. ఇలా అవుతుందని అని మనలో కొంతమంది టిక్ టాక్ బ్యాన్ అయినప్పుడే ఊహించాం. కొంతమంది మాత్రం అలా ఏం అవ్వదు అని ధైర్యంగా ఉన్నారు. కానీ ఆ భయపడిన వాళ్ళ మాటే నిజమైంది.

Video Advertisement

ఇప్పుడు చాలామందికి ఏం చేయాలో కూడా అర్థం కాదు. పబ్ జి కి అంతలా అడిక్ట్ అయిపోయాం. ఇప్పుడు ఏం చేయాలి? పబ్ జి బ్యాన్ అయిపోయిన తర్వాత ఏ గేమ్ ఆడాలి? దాదాపు పబ్ జి ఆడేవాళ్ళందరి లో ప్రస్తుతం ఇవే ఆలోచనలు వస్తున్నాయి.

యాప్స్ మాత్రమే కాకుండా గ్జైయోమి బ్రౌజర్ కూడా ప్రభుత్వం ద్వారా బ్యాన్ చేయబడింది . ఈ అప్లికేషన్స్ వల్ల ఒక సంవత్సరానికి భారతదేశ యూజర్ల ద్వారా అందే రెవెన్యు 200 మిలియన్ డాలర్లట. పబ్ జి ద్వారా అందే రెవెన్యూ 100 మిలియన్ల డాలర్లు అంటే భారత దేశ కరెన్సీ ప్రకారం 731 కోట్లు.

బిజినెస్ టుడే తో కౌంటర్ పాయింట్ రీసెర్చ్ కి చెందిన సీనియర్ ఎనలిస్ట్ మాట్లాడుతూ నిషేధించబడిన చైనీస్ అప్లికేషన్స్ వల్ల 200 మిలియన్ల డాలర్లు నష్టం వస్తుందని, పబ్ జి వల్ల మాత్రమే భారతీయ యూజర్ల నుండి 80 మిలియన్ల నుండి 100 మిలియన్ల వరకు నష్టం రావచ్చు అని తెలిపారు.

పబ్ జి మొబైల్ ఇన్ కమ్ కి భారతదేశం అందించే కాంట్రిబ్యూషన్ 5 శాతం కంటే తక్కువగానే ఉందని నిపుణులు చెప్తున్నారు. జూన్ నెలలో టిక్ టాక్, యూసీ బ్రౌజర్, షేర్ ఇట్, వి చాట్ వంటి కొన్ని మొబైల్ అప్లికేషన్స్ బ్యాన్ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో పబ్ జి కూడా చేరింది.


End of Article

You may also like