Ads
ప్రముఖ సినీ నటులు జయ ప్రకాశ్ రెడ్డి గుంటూరులో ఉన్న తన నివాసంలో కార్డియాక్ అరెస్ట్ తో మరణించారు. జయప్రకాష్ రెడ్డి ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలు, సహాయ పాత్రలు, కామెడీ పాత్రలు కూడా చేశారు. 1988లో వచ్చిన బ్రహ్మపుత్రుడు సినిమాల్లో నటించారు జయ ప్రకాష్ రెడ్డి.
Video Advertisement

తర్వాత శత్రువు, లారీ డ్రైవర్, బొబ్బిలిరాజా, చిత్రం భళారే విచిత్రం, జంబలకిడిపంబ, ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, విక్రమార్కుడు, కింగ్, గబ్బర్ సింగ్, బ్రూస్ లీ, ఖైదీ నెంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి, అమర్ అక్బర్ ఆంటోనీ ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు.
జనవరిలో విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమాలో జయ ప్రకాష్ రెడ్డి చివరిగా మనకి తెరపై కనిపించారు. ఎలాంటి పాత్ర అయినా సరే చేయగలరు అని నిరూపించుకున్నారు జయ ప్రకాష్ రెడ్డి. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు.జయ ప్రకాష్ రెడ్డి నటించిన కొన్ని సినిమాల్లో ఆయన చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ లో మనం చూస్తూ ఉంటాం. జయ ప్రకాష్ రెడ్డి గారు నటించిన కొన్ని గుర్తుండిపోయే క్యారెక్టర్స్ ఇవే.
#1 కృష్ణ

#2 రెడీ

#3 నాయక్


#4 లెజెండ్

#5 కబడ్డీ కబడ్డీ

#6 నువ్వొస్తానంటే నేనొద్దంటానా

#7 టెంపర్

#8 బాద్షా

#9 కిక్

#10 ఛత్రపతి

#11 సొంతం

జయ ప్రకాష్ రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం.
End of Article
