ఎవరీ “బిగ్ బాస్ 4 దివి” అంటూ తెగ వెతికేస్తున్నారంట.? ఆమె గురించి ఆసక్తికర విషయాలివే.!

ఎవరీ “బిగ్ బాస్ 4 దివి” అంటూ తెగ వెతికేస్తున్నారంట.? ఆమె గురించి ఆసక్తికర విషయాలివే.!

by Mohana Priya

Ads

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో కొంతమంది గురించి మనకు తెలుసు కొంతమంది ఎవరో మనకి అంత పెద్దగా తెలియదు. దివి వడ్త్య. ఈ పేరు బిగ్ బాస్ సీజన్ ఫోర్ హంగామా మొదలైనప్పటి నుండి వినిపించింది. ముందు తనెవరో మనకి సడన్ గా గుర్తు రాలేదు.

Video Advertisement

తర్వాత తను మహర్షి సినిమాలో ఉంది అని అందరికీ తెలిసింది. బిగ్ బాస్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ లో చెప్పిన ప్రకారం దివి ఒక మోడల్.దివి తల్లి, ఇంకా సోదరుడు డాక్టర్స్ అట. దివి హైదరాబాద్ లోనే పుట్టి పెరిగారు. మాస్టర్స్ కంప్లీట్ చేసిన దివి కి యాక్టింగ్ పై ఉన్న ఇష్టంతో నటన వైపు దృష్టి పెట్టారు.

పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేయడం మొదలు పెట్టారు. వెబ్ సిరీస్ లో కూడా నటించారు. ఆ తర్వాత మహర్షి సినిమా లో మహేష్ బాబు క్లాస్ మేట్ గా నటించారు. సినిమాలో కనిపించింది కొన్ని సన్నివేశాల్లోనే అయినా బాగా రిజిస్టర్ అయ్యారు.

బిగ్ బాస్ లో అడుగుపెట్టిన దివి ప్రస్తుతం ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు. దివి తో పాటు అభిజిత్, గంగవ్వ, మెహబూబ్, సూర్య కిరణ్, జోర్దార్ సుజాత, అఖిల్ సార్థక్ కూడా నామినేషన్స్ లో ఉన్నారు.


End of Article

You may also like