Ads
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కేసు లో మూడు రోజుల ఎంక్వయిరీ తర్వాత రియా చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వీడియో కాల్ ద్వారా రియా చక్రవర్తిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఎన్సీబీ అధికారులు రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్ ని కొట్టివేశారు. రియా చక్రవర్తి ని 14 రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం రియా చక్రవర్తిని జైలుకి తరలించారు.
Video Advertisement
ఇండియా టుడే కథనం ప్రకారం డ్రగ్స్ సరఫరా చేయడం, డ్రగ్స్ అరేంజ్ చేయడం, వినియోగించడం వంటి పలు అంశాలు ఈ కేసులో ఉన్న కారణంగా రియా చక్రవర్తి పై ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్) యాక్ట్ 1985 ప్రకారం, సెక్షన్ 22, 20, 27, 29 కింద కేసు నమోదు చేశారు.
ఒక సెక్షన్ కి ఒక రకమైన శిక్ష ఉంటుందట. సెక్షన్ 22 అంటే డ్రగ్స్ తీసుకోవడం, సరఫరా చేయడం. ఈ సెక్షన్ కింద పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముందట. అంతేకాకుండా దాదాపు రెండు లక్షల వరకు జరిమానా చెల్లించాలట. 20 అంటే డ్రగ్స్ కొనడం ఇంకా అమ్మడం.
ఈ సెక్షన్ కింద దాదాపు 10 ఏళ్లు జైలు శిక్ష, ఒక్కొక్కసారి శిక్ష కాలం ఇంకా పెరుగుతుందట, జైలు శిక్షతో పాటు లక్ష నుండి రెండు లక్షల వరకు జరిమానా చెల్లించాలి. 27 సెక్షన్ కింద దాదాపు ఏడాది కాలం జైలు శిక్ష, లేదా 20,000 రూపాయల జరిమానా చెల్లించాల్సి వస్తుందట. లేదా శిక్షతో పాటు జరిమానా కూడా పడే అవకాశాలు ఉన్నాయట. డ్రగ్స్ కేసు విషయంలో రియా చక్రవర్తి కొంత మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు కూడా చెప్పారట.
End of Article