Ads
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ సురేష్ రైనా భారతదేశానికి తిరిగి ప్రయాణం అయిన దానికి రెండు కారణాలు ఉన్నాయి అనే వార్తలు వచ్చాయి. జాగరణ్ కథనం ప్రకారం, పటాన్ కోట్ లోని థరియాల్ లో నివసించే ఇంకొక బంధువు పై దాడి జరిగిందట. దెబ్బలు బాగా తగలడంతో సురేష్ రైనా బంధువు మరణించారట.
Video Advertisement
సురేష్ రైనా తండ్రి సోదరి అయిన ఆశా దేవి ఆరోగ్యం విషమంగా ఉందట. అంతేకాకుండా సురేష్ రైనా ఇండియాకి తిరుగు ప్రయాణం అవ్వడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి అని అన్నారు.
క్రిక్ ట్రాకర్ కథనం ప్రకారం సురేష్ రైనా కి యాజమాన్యం ఇచ్చిన రూమ్ నచ్చలేదట. బయో బబుల్ ప్రోటోకాల్ పాటించడం కష్టం గా అనిపించిందట. మహేంద్ర సింగ్ ధోని కి ఇచ్చిన రూమ్ లాంటి రూమ్ కావాలి అని సురేష్ రైనా అనుకున్నారట. సురేష్ రైనా ఉండే రూమ్ కి బాల్కనీ సరిగా లేదట. అది కొంచెం ఇబ్బందిగా అనిపించిందట.
దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్ మాట్లాడారు. తర్వాత సురేష్ రైనా కూడా పరిస్థితి మొత్తం సర్దుకుంది అని, శ్రీనివాసన్ తనకి తండ్రి లాంటి వారు అని, ఒక తండ్రి కొడుకు ని ఎలా అంటారో అదే విధంగా శ్రీనివాసన్ తనని అన్నారు అని చెప్పారు. దాంతో పరిస్థితి అంతా మామూలు అయింది.
ఇదిలా ఉండగా ఇప్పుడు అందరిలో మొదలైన ప్రశ్న ఒకటే. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ వైస్ కెప్టెన్ స్థానం ఎవరు తీసుకుంటారు అని. ఇదే ప్రశ్న ట్విటర్ లో ఒక వ్యక్తి పోస్ట్ చేశారు. దానికి చెన్నై సూపర్ కింగ్స్ ” వైస్ (wise) కెప్టెన్ ఉండగా భయం ఎందుకు?” అని అర్థం వచ్చేలా గా తమిళ్ లో రిప్లై ఇచ్చారు. ఇక్కడ wise అంటే తెలివైన అని అర్థం. దాంతో ఇప్పుడు క్రికెట్ అభిమానులలో అసలు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి వైస్ కెప్టెన్ ఉంటారా? ఉండరా? అనే అనుమానాలు మొదలయ్యాయి.
End of Article