Ads
ఒక టీవీ షో హిట్ అవ్వాలంటే కంటెంట్ తో పాటు హోస్ట్ కూడా అంతే ముఖ్యం. ఒక రకంగా చెప్పాలంటే హోస్ట్ ప్రోగ్రాం కి ఫేస్ లాంటి వారు. ఇప్పుడు మనం సినిమా చూడాలంటే అందులో హీరో ఎవరో ఖచ్చితంగా తెలుసుకుని చూస్తాం. అలా హీరోల వల్ల హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళనే క్రౌడ్ పుల్లర్స్ అంటారు. అదే విధంగా ఒక ప్రోగ్రాం చూడాలన్నా కూడా దానికి హోస్ట్ ఎవరో తెలుసుకుని చూస్తాం.
Video Advertisement
మామూలు షో కే యాంకర్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే యాజమాన్యం, బిగ్ బాస్ లాంటి షో కి మరింత జాగ్రత్తతో హోస్ట్ గా ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తారు. మొదటి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా హోస్ట్ చేసి,తన లో మంచి నటుడు, డాన్సర్, సింగర్ మాత్రమే కాకుండా మంచి హోస్ట్ కూడా ఉన్నారు అని ప్రూవ్ చేశారు.
రెండవ సీజన్ లో నాని హోస్ట్ చేశారు. బహుశా ఈ సీజన్ లో వచ్చినన్ని కాంట్రవర్సీస్, వచ్చినంత నెగిటివిటీ మిగిలిన రెండు సీజన్స్ లో రాలేదేమో. కానీ అన్నిటినీ నాని తనదైన శైలిలో హ్యాండిల్ చేసి ప్రేక్షకులని ఇంప్రెస్ చేశారు. ఇంక మూడవ సీజన్ లో కింగ్ నాగార్జున హోస్ట్ బాధ్యతలను తీసుకున్నారు. నాగార్జున హోస్టింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతకుముందు మీలో ఎవరు కోటీశ్వరుడు షో హోస్ట్ చేసిన నాగార్జునకి బిగ్ బాస్ కేక్ వాక్ అని చెప్పొచ్చు.
బిగ్ బాస్ ప్రోగ్రాంలో జరిగే గొడవల వల్ల ఛానల్ యాజమాన్యానికి టిఆర్పీ వస్తుంది. కానీ అసలు బిగ్ బాస్ షో పాపులర్ అవ్వాలంటే మాత్రం పై చేయి హోస్ట్ దే ఉంటుంది. ఇది వినడానికి మీకు కొంచెం వింతగా అనిపించొచ్చు. కానీ ఒకసారి మీరే ఆలోచించండి. నిజంగా ఒక ప్రామిసింగ్ హోస్ట్ లేకపోతే ఈ ప్రోగ్రాం కి ఇంత పాపులారిటీ వచ్చేదా? వీకెండ్ ఎపిసోడ్ కోసం మనందరం ఇంతగా వెయిట్ చేసే వాళ్లమా? ఇంకొక విషయం కూడా ఏంటంటే బిగ్ బాస్ సీజన్ మొదలవుతోంది అంటే కంటెస్టెంట్స్ ఎవరు అనే ప్రశ్న తో పాటు హోస్ట్ ఎవరు అనే ప్రశ్న కూడా ఎక్కువగా వినిపిస్తుంది.
అంతేకాకుండా షో అనౌన్స్మెంట్ చేసేటప్పుడు ముందుగా రివీల్ చేసేది హోస్ట్ పేరే. చాలామంది వారం మొత్తం ఎపిసోడ్స్ మిస్ చేసినా కూడా, వీకెండ్ లో వచ్చే రెండు ఎపిసోడ్స్ మాత్రం మిస్ అవ్వకుండా చూస్తారు. ఎందుకంటే హోస్ట్ పాపులారిటీ ఆ రేంజ్ లో ఉంటుంది. కాబట్టి వాళ్ళ పారితోషకం కూడా అలాగే ఉంటుంది. బిగ్ బాస్ సీజన్స్ హోస్ట్ ల పారితోషికం ఎంతో ఇప్పుడు చూద్దాం.
#1 జూనియర్ ఎన్టీఆర్
మొదటి సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్, ఒక ఎపిసోడ్ కి 35 లక్షల పారితోషికం తీసుకున్నారు.
#2 నాని
రెండవ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించిన నాది ఒక ఎపిసోడ్ కి 10 నుండి 12 లక్షలు పారితోషికం తీసుకున్నారు.
#3 నాగార్జున
మూడవ సీజన్ కి, అలాగే నాలుగవ సీజన్ కి హోస్ట్ గా ఉన్న నాగార్జున మూడవ సీజన్ కి 10 నుండి 12 లక్షల పారితోషికం, నాలుగవ సీజన్ కి 12 నుండి 14 లక్షల పారితోషకం అందుకుంటున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
End of Article