Ads
ప్రముఖ సినీ నటులు జయ ప్రకాశ్ రెడ్డి గుంటూరులో ఉన్న తన నివాసంలో బాత్రూంలో కుప్పకూలి కార్డియాక్ అరెస్ట్ తో మరణించారు. జయప్రకాష్ రెడ్డి ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలు, సహాయ పాత్రలు, కామెడీ పాత్రలు కూడా చేశారు. 1988లో వచ్చిన బ్రహ్మపుత్రుడు సినిమాల్లో నటించారు జయ ప్రకాష్ రెడ్డి.
Video Advertisement
తర్వాత శత్రువు, లారీ డ్రైవర్, బొబ్బిలిరాజా, చిత్రం భళారే విచిత్రం, జంబలకిడిపంబ, ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, విక్రమార్కుడు, కింగ్, గబ్బర్ సింగ్, బ్రూస్ లీ, ఖైదీ నెంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి, అమర్ అక్బర్ ఆంటోనీ ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు. జనవరిలో విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమాలో జయ ప్రకాష్ రెడ్డి చివరిగా మనకి తెరపై కనిపించారు.
జయప్రకాష్ రెడ్డి గారి మరణం పై పలు సెలబ్రిటీలు సోషల్ మీడియా లో తమ సంతాపం వ్యక్తం చేశారు. అలాగే యాంకర్, నటి అనసూయ కూడా సోషల్ మీడియా ద్వారా జయప్రకాశ్ రెడ్డి గారి మరణం పై తన సంతాపం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల జయ ప్రకాష్ రెడ్డి గారు బాత్రూం లో కుప్పకూలిపోయి ఉన్న వీడియో ని కవర్ చేసి ప్రసారం చేశారు.
దీనిపై అనసూయ ట్విట్టర్ వేదికగా ” నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. బాత్రూం ని కూడా వదలట్లేదు. ఒక వ్యక్తి మరణం దగ్గర కూడా డిగ్నిటీ పాటించడం లేదు” అని అర్థం వచ్చేలాగా ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు “నిజంగానే న్యూస్ కవరేజ్ కోసం ఇలా చేయడం తప్పు” అని అనసూయ కి మద్దతిస్తున్నారు.
End of Article