దేత్తడి హారిక చేసిన పనికి ఫ్యాన్స్ ఫైర్… ఈ టైం లో ఇవి అవసరమా అంటూ కామెంట్స్

దేత్తడి హారిక చేసిన పనికి ఫ్యాన్స్ ఫైర్… ఈ టైం లో ఇవి అవసరమా అంటూ కామెంట్స్

by Mohana Priya

Ads

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో మొదటి నుండి స్ట్రాంగ్ గా వినిపించిన పేరు అలేఖ్య హారిక. యూట్యూబ్ లో దేత్తడి ఛానల్ తో మనందరికీ పరిచయమయ్యారు అలేఖ్య హారిక. ఆ ఛానల్ లో సాధారణంగా మనం రోజూ జీవితంలో ఎదుర్కొనే సమస్యలను సరదాగా చూపిస్తూ ఎంతో పాపులర్ అయ్యారు హారిక. సెటైరికల్ గా అందర్నీ నవ్వించేలా ఉండే ఈ వీడియోస్ ద్వారా ఎంతోమందికి చేరువయ్యారు.

Video Advertisement

అలేఖ్య హారిక యూట్యూబ్ లో మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా కనిపించారు. కానీ తెలుగు సినిమా లో కాదు. అర్జున్ రెడ్డి సినిమాలో హీరో  డాక్టర్ అయిన తర్వాత హాస్పిటల్ లో ఇద్దరు నర్స్ లు అర్జున్ రెడ్డి కి అసిస్ట్ చేస్తారు. గుర్తుందా? ఆ ఇద్దరూ నర్స్ లలో ఒక నర్స్ పాత్రను తెలుగులో లహరీ షారీ పోషించగా, తమిళ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మ లో  ఆ పాత్ర లో అలేఖ్య హారిక కనిపించారు.

మంగళవారం నాడు అలేఖ్య హారిక పుట్టినరోజు. ఈ సందర్భంగా అలేఖ్య హారిక సోషల్ మీడియా అకౌంట్ లో గత సంవత్సరం తన పుట్టిన రోజును హారిక కొంత మంది పిల్లల మధ్య జరుపుకొని, వాళ్లకి పండ్లు, బిస్కెట్లు పంచిపెట్టిన ఫోటోలను పోస్ట్ చేశారు.

https://www.instagram.com/p/CE4UIGKJkiM/

ఈ పోస్ట్ లో అలేఖ్య హారిక చేసిన పని పాజిటివ్ గా ఉన్నా కానీ, ఈ సమయంలో పోస్ట్ చేయడంతో దీనిపై స్పందన కొంచెం నెగిటివ్ గానే ఉంది. ఈ ఫోటోలు గత ఏడాది పుట్టిన రోజువి అయితే అప్పుడే పోస్ట్ చేయాలి కానీ, ఇప్పుడు చేస్తున్నారు ఏంటి? వోట్స్ కోసమా? అయినా ఇప్పుడు ఎలిమినేషన్ జోన్ లో లేదు కదా? ఎందుకు ఇంత పబ్లిసిటీ? అని కామెంట్స్ వస్తున్నాయి. కానీ మరికొంతమంది మాత్రం హారిక చేసింది మంచి పనే అయినా కూడా ఈ సమయంలో పోస్ట్ చేశారు కాబట్టి ఇలాంటి విమర్శలు వస్తుండొచ్చు. ఈ సమయంలో నెగిటివిటీ కి దూరంగా ఉండండి అని అంటున్నారు.

Bigg Boss Telugu 4 Alekhya Harika (Dhethadi) images,

కానీ బిగ్ బాస్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అందరికీ తెలుసు. షో తర్వాత పాపులారిటీ ఎంత వస్తుందో, షో లో ఉన్నప్పుడు నెగిటివిటీ కూడా అంతే వస్తుంది. అందుకే షో కి వెళ్లే కంటెస్టెంట్స్ తో పాటు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. కాబట్టి, అలేఖ్య హారిక ఇంస్టాగ్రామ్, ఇంకా ఇతర సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండిల్ చేసే వాళ్ళు కూడా ఈ నెగిటివ్ కామెంట్స్ ని అంత పెద్దగా పట్టించుకోవడం లేదు.


End of Article

You may also like