ఐపీఎల్ ట్రోఫీ మీద సంస్కృతంలో రాసున్నది ఏంటో తెలుసా? అర్థం ఇదే.!

ఐపీఎల్ ట్రోఫీ మీద సంస్కృతంలో రాసున్నది ఏంటో తెలుసా? అర్థం ఇదే.!

by Mohana Priya

Ads

ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా అందరూ మాట్లాడుకునేది రెండింటి గురించే. కరోనా, లాక్ డాన్ గురించి అనుకున్నారా? కాదు. అయినా ఇంక వాటి గురించి మాట్లాడుకునే కూడా పెద్దగా ఏమి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వాలు వాటి మీదే రాత్రి పగలు కష్టపడి పని చేస్తున్నారు. అలా కష్టపడి పని చేసి ముందు కంటే పరిస్థితి మెరుగు పడేలా చేశారు. ఇంకా కరోనా కేసుల గురించి కూడా టీవీలో, సోషల్ మీడియాలో అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. బహుశా గత కొద్ది నెలలుగా ప్రతి చోటా కరోనా పేరు విని విని జనాలకు అలవాటు అయిపోయి ఉండొచ్చు.

Video Advertisement

 

సరే. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో జనాలు ఎక్కువగా మాట్లాడేది బిగ్ బాస్, ఐపీఎల్ గురించి. రెండిట్లో ఒకటి ఆల్రెడీ మొదలైపోయింది. ఇంకొకటి మొదలవబోతోంది. మొదలు అయిపోయిన బిగ్ బాస్ గురించి ఏం జరుగుతోంది అని మాట్లాడుకుంటున్నాం, మొదలు అవ్వ బోయే ఐపిఎల్ గురించి ఎలా ఉండబోతోంది అని మాట్లాడుకుంటున్నాం.

సాధారణంగా అయితే ఐపీఎల్ సీజన్ ఇది కాదు. కానీ కరోనా కారణంగా ఆలస్యంగా ప్రారంభం అవుతోంది. ఎప్పుడు స్టార్ట్ అయితే ఏంటి, అసలు అంటూ ఐపీఎల్ మొదలవుతోంది కదా అని జనాలు కూడా ఈసారి రెట్టింపు ఆసక్తి తో ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నారు.  సెప్టెంబర్ 19 నుండి ఐపీఎల్ మొదలవనుంది. దానికోసం ప్లేయర్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు.

నవంబర్ 10వ తేదీన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి ట్రోఫీ ఎవరికి రాసిపెట్టి ఉందో అని క్రికెట్ అభిమానుల లో డిస్కషన్ నడుస్తోంది. ట్రోఫీ ఎవరికి రాసిపెట్టి ఉంది అనే విషయం వాళ్ల పర్ఫామెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడే ఏం చెప్పలేం. ఇప్పుడు ట్రోఫీ మీద ఏమి రాసి ఉందో తెలుసుకుందాం.

మనలో చాలా తక్కువ మంది ఈ విషయాన్ని గమనిస్తాం. ఐపీఎల్ ట్రోఫీ మీద సంస్కృతంలో ఒక వాక్యం రాసి ఉంటుంది.  ఐపీఎల్ ట్రోఫీ మీద రాసి ఉన్న సంస్కృత వాక్యం “యత్ర ప్రతిభ అవసర ప్రాప్నోతిహి (Yatra Pratibha Avsara Prapnotihi)”. అంటే ప్రతిభ ఉన్న చోట అవకాశం ఉంటుంది లేదా ప్రతిభకి అవకాశం కలిసినప్పుడు (where talent meets opportunity) అని అర్థం అట. ఈ వాక్యాన్ని ఇప్పటివరకు మీరు గమనించకపోతే ఈసారి అబ్జర్వ్ చేయండి.


End of Article

You may also like