Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో కాలం కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు సుధాకర్. ఒక రకమైన వాయిస్ మాడ్యులేషన్ తో మాట్లాడుతూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. సుధాకర్ ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం లో పుట్టారు. గుంటూరులో ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న సుధాకర్, తర్వాత మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరారు.
Video Advertisement
ఆ తర్వాత సినిమాల్లో లీడ్ యాక్టర్ గా కెరీర్ మొదలు పెట్టారు. సృష్టి రహస్యాలు, ఊరికిచ్చిన మాట, భోగి మంటలు, కొంటె కోడళ్ళు ఇంకా కొన్ని సినిమాల్లో మెయిన్ లీడ్ గా నటించారు. ఆ తర్వాత కమెడియన్ గా కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. సుధాకర్ నటనతో పాటు డైలాగ్ డెలివరీ కూడా డిఫరెంట్ గా ఉండడంతో, స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు.
పెద్దరికం, స్నేహితులు సినిమా కి రెండు సార్లు నంది అవార్డు కూడా అందుకున్నారు సుధాకర్. సుధాకర్ తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ లో కూడా కొన్ని సినిమాల్లో మెయిన్ లీడ్ గా నటించారు. అలాగే హిందీలో కూడా 1983 లో శుభ్ కామ్నా అనే చిత్రంలో నటించారు.
కొన్ని సంవత్సరాల క్రితం సుధాకర్ బ్రెయిన్ స్ట్రోక్ కి గురయ్యారు అనే వార్తలు వచ్చాయి. తర్వాత తెలుగులో 2017 లో వచ్చిన ఇ ఈ సినిమాలో కనిపించారు సుధాకర్. తమిళ్ లో 2018 లో సూర్య హీరోగా వచ్చిన తానా సేంద కూట్టం (తెలుగులో గ్యాంగ్) సినిమాలో రమ్యకృష్ణ భర్త పాత్రలో నటించారు. సుధాకర్ కొడుకు పేరు మైకేల్ బెన్ని. మైకేల్ బెన్ని పూర్తి పేరు బెనెడిక్ట్ మైకేల్ అట.
మైకేల్ బెన్ని కి నటన అంటే పెద్దగా ఆసక్తి లేదట. మైకేల్ ప్రస్తుతం ఒక మల్టీ నేషనల్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయి గా ఉద్యోగం చేస్తున్నారట. సుధాకర్ గారు మళ్ళీ ఒక మంచి పాత్ర తో కం బ్యాక్ ఇవ్వాలి అని ఆశిద్దాం
End of Article