చెన్నై సూపర్ కింగ్స్ టీం లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన 5 మంది ఆటగాళ్లు వీళ్ళే.!

చెన్నై సూపర్ కింగ్స్ టీం లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన 5 మంది ఆటగాళ్లు వీళ్ళే.!

by Mohana Priya

Ads

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటగా ఐపీఎల్ సక్సెస్ అయిన తర్వాతే బీపీఎల్, పిపిఎల్ కూడా మొదలయ్యాయి.  ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకోవడంతో పాటు, ఆడిన ప్రతి సీజన్ లోనూ టాప్ ఫోర్ జాబితాలో ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించడంలో మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు.

Video Advertisement

గత కొన్ని సంవత్సరాలుగా చెన్నై సూపర్ కింగ్స్ లో ఎంతో మంది ప్లేయర్స్ ఆడారు. కానీ కొంతమంది ప్లేయర్స్ మాత్రం జట్టులో ఎక్కువకాలం లేరు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున కేవలం ఒక్క మ్యాచ్ ఆడిన ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 అరుణ్ కార్తీక్

చాంపియన్స్ లీగ్ టి20 మ్యాచ్ లో లాస్ట్ సిక్స్ ద్వారా చాలామందికి అరుణ్ కార్తీక్ గుర్తుండే ఉంటారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో కూడా అరుణ్ కార్తీక్ ఉన్నారు. కానీ అరుణ్ కార్తీక్ బ్యాక్అప్ వికెట్ కీపింగ్ ఆప్షన్ కాబట్టి ఆడే అవకాశం ఎక్కువగా రాలేదు. సాధారణంగా టీ20 ఫార్మాట్‌ ప్రకారం XI లో ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ఎక్కువగా ఆడడం అనేదాన్ని టీమ్ కొంచెం అవాయిడ్ చేస్తారు.

#2 మార్క్ వుడ్

ముంబై ఇండియన్స్‌ తో జరిగిన ఐపీఎల్ 2018 సీజన్ ఓపెనర్ ‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడారు మార్క్ వుడ్. ముంబై బ్యాట్స్ మెన్ తో ఆడినప్పుడు స్కోర్ సరిగ్గా చేయకపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుండి తొలగించబడ్డారు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం మార్క్ వుడ్ ని జట్టు నుండి విడుదల చేశారు. తర్వాత మార్క్ వుడ్ తిరిగి ఐపీఎల్ కి రాలేదు.

#3 విజయ్ శంకర్

ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ 2019 లో భారత ఆల్ రౌండర్ విజయ్ శంకర్ దేశానికి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి ఆడుతున్నారు విజయ్ శంకర్. కానీ ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడారు విజయ్ శంకర్. అప్పుడు ఎక్కువ అనుభవం లేకపోవడంతో, అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో సుబ్రమణ్యం బద్రీనాథ్ మరియు ఆల్బీ మోర్కెల్ వంటి పెద్ద మ్యాచ్ విజేతలు ఉండడంతో, విజయ శంకర్ సాలిటరీ గేమ్స్ అప్పుడు మాత్రమే ఆడారు.

#4 చంద్రశేఖర్ గణపతి

చంద్రశేఖర్ గణపతి ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడిన విషయం చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. ఐపీఎల్ రెండవ ఎడిషన్ లో కేవలం ఒక్క గేమ్ ఆడారు చంద్రశేఖర్ గణపతి. కానీ ఆట లో స్కోర్ చేయలేకపోయారు. 2010 తర్వాత ఐపీఎల్ కి తిరిగి రాలేదు చంద్రశేఖర్ గణపతి.

#5 తిసారా పెరెరా

శ్రీలంక ఆల్ రౌండర్ తిసారా పెరెరా తన ఐపిఎల్ కెరీర్ ‌లో చాలా ఫ్రాంచైజీల కోసం ఆడారు. అందులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఒకటి. 2010 లో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులో ప్లేయర్ గా తన కెరియర్ ను ప్రారంభించారు తిసారా పెరెరా. ఒక్క మ్యాచ్ ఆడిన తర్వాత టీం యాజమాన్యం తిసారా పెరెరా ని రిలీజ్ చేశారట. తిసారా పెరెరా తరువాత కొచ్చి టస్కర్స్ కేరళ, సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, మరియు రైజింగ్ పూణే సూపర్ ‌జెయింట్ తరపున ఆడారు. ఐపీఎల్ లో పెద్దగా విజయం సాధించకపోయినప్పటికీ తన ఐపీఎల్ కెరీర్‌ లో ఫోర్ల కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ప్రత్యేక రికార్డుని సొంతం చేసుకున్నారు తిసారా పెరెరా.


End of Article

You may also like