అప్పుడు అంత ఆఫర్ ఇచ్చినా OTT రిలీజ్ కి “NO”…కానీ ఇప్పుడు రేట్ ఎంత అంటే?

అప్పుడు అంత ఆఫర్ ఇచ్చినా OTT రిలీజ్ కి “NO”…కానీ ఇప్పుడు రేట్ ఎంత అంటే?

by Mohana Priya

Ads

ప్రస్తుత పరిస్థితి ముందు కంటే మెరుగు పడినా కూడా, థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయి అనే విషయంపై స్పష్టత లేదు. ఒకవేళ తెరుచుకున్నా కూడా టికెట్ ఖరీదు ఎంత ఉంటుందో తెలీదు. ఒకవేళ టికెట్ ఖరీదు ఎక్కువగా ఉంటే ఎక్కువమంది థియేటర్ కి వెళ్లి సినిమా చూడటానికి అంతగా ప్రిఫర్ చేయకపోవచ్చు. దాంతో నిర్మాతలకు అనుకున్నంత డబ్బులు వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు.

Video Advertisement

కాబట్టి అందరు హీరోలు, ప్రొడ్యూసర్లు ఓటీటీ ప్లాట్ ఫాం లో తమ సినిమాలను విడుదల చేయడానికి ఆలోచిస్తున్నారు. ఇప్పటికే వి అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఎన్నో రోజుల నుండి థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ సినిమా బాగుంటుంది అని అనుకున్న నిశ్శబ్దం కూడా అక్టోబర్ 2వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతోంది. ఇప్పుడు ఈ జాబితాలో కి మరొక సినిమా కూడా చేరబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే. ప్రదీప్ హీరోగా నటించిన మొదటి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మార్చిలో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది.అయితే అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అంతకుముందు ఈ సినిమా ఓటీటీ లో విడుదల చేయడానికి అడిగితే సినిమా బృందం ఒప్పుకోలేదట. కానీ ప్రస్తుతం ఉన్న కారణాల వల్ల ఈ సినిమాని ఓటీటీ లో విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారట.

టీ2బి లైవ్ కథనం ప్రకారం అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అంతకుముందు అడిగినప్పుడు 6.5 కోట్ల మొత్తానికి అడిగారట. కానీ ఇప్పుడు మాత్రం అంత మొత్తానికి తీసుకోము అని డీల్ కుదుర్చుకునే డిజిటల్ రైట్స్ మొత్తాన్ని 3 – 3.2 కోట్లకి చేశారట. దాంతో సినిమా బృందం నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలు అన్నీ నిజమో కాదో, అసలు సినిమా ఓటీటీ లో విడుదలవుతుందో లేదా థియేటర్ లో విడుదల అవుతుందో తెలియాలి అంటే అమెజాన్ ప్రైమ్ బృందం, లేదా సినిమా బృందం సినిమా గురించి అధికారికంగా ప్రకటించేంత వరకు ఆగాల్సిందే.


End of Article

You may also like