Ads
గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారు స్వర్గస్తులయ్యారు. బాలు గారి మరణం తో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో కూడా ఎంతో మంది బాధలో ఉన్నారు. ఎన్నో రంగాలకు చెందిన ప్రముఖులు కూడా బాలు గారి మరణం పై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే బాలు గారి మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. బాలు గారికి సినిమా ఇండస్ట్రీలో, అలాగే బయట కూడా ఎంతో మంది మిత్రులు ఉన్నారు.
Video Advertisement
వాళ్ళందరూ బాలు గారి గురించి చెప్పే మాటలు వింటే ఆయన గొప్ప కళాకారుడు మాత్రమే కాకుండా ఎంతో గొప్ప వ్యక్తి అనే విషయం కూడా అర్థమవుతుంది. బాలు గారు సీనియర్ నటుడు నరేష్ కి పంపిన ఒక వాయిస్ రికార్డింగ్ ఇటీవల యూట్యూబ్ ద్వారా బయటికి వచ్చింది. ప్రస్తుతం ఆ వాయిస్ రికార్డింగ్ వైరల్ అవుతోంది.
ఈ వాయిస్ రికార్డింగ్ లో బాలు గారు మాట్లాడుతూ “గుడ్ ఈవెనింగ్ నరేష్. నేను ఎస్పిబి అంకుల్ ని. ఎలా ఉన్నావు నాన్నా? బాగున్నావు కదా? నాకు కృష్ణ గారి నెంబర్ ఏదైనా ఉంటే ఇవ్వగలవా? పుట్టినరోజు పుట్టిన రోజు కాదు. అమ్మ లేదు. తెలుసు. రేపు ఒకసారి. ఎందుకో మాట్లాడాలి అనిపించింది నాయనా. నెంబర్ ఉంటే ఇవ్వు. లేదంటే నువ్వేదన్నా టైం చెప్తే నీకు ఫోన్ చేస్తాను. ఆయనతో మాట్లాడించే ఏర్పాటు చేయి తండ్రీ. గాడ్ బ్లెస్స్ యు. గుడ్ నైట్” అని అన్నారు.
watch video:
End of Article